అమెరికాలో సంచలనం: హిందూ మాసంగా అక్టోబర్

Update: 2021-09-26 06:30 GMT
భారతీయ సంస్కృతికి అమెరికాలో తగిన గుర్తింపు లభించింది. భారతీయుల పండుగలకు అమెరికా పెద్దపీట వేసింది. తాజాగా హిందూ పండుగలకు నెలవైన అక్టోబర్ మాసాన్ని 'హిందూ సాంస్కృతిక వారసత్వ మాసంగా' గుర్తిస్తున్నట్టు అమెరికాలోని పలు రాష్ట్రాలు తాజాగా ప్రకటించాయి. టెక్సాస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, ఓహాయో, మసాచుసెట్స్ తోపాటు పలు ఇతర రాష్ట్రాల గవర్నర్ కార్యాలయాలు ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశాయి.

అమెరికాలో హిందూ సంఘాల కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది.. 'అమెరికాలో వివిధ మతాలు, సంస్కృతులు శాంతికి చిహ్నాలుగా.. ఆశాదీపాలుగా నిలుస్తున్నాయి. ఆయా మతాల వారు తమ సేవల ద్వారా అమెరికా అభ్యున్నతికి తోడ్పడుతున్నారు. అందుకే హిందూ మతం సంస్కృతి, చరిత్ర కూడా అమెరికా అభ్యున్నతిలో కీలకపాత్ర పోషించాయి' అని ఆయా రాష్ట్రాల గవర్నర్లు, సెనెటర్లు, కాంగ్రెస్ ఓ కీలక ప్రకటన విడుదల చేశారు.

ఇక అమెరికా ఫెడరల్ ప్రభుత్వం కూడా అక్టోబర్ నెలను హిందూ సాంస్కృతిక మాసంగా గుర్తించేలా అక్కడి మిందూ సంఘాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. బైడెన్ ప్రభుత్వాన్ని ఆ దిశగా ప్రోత్సహించేలా ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నాయి.

హిందూ సంస్కృతి, విలువలపై చాలా తక్కువమందికి అవగాహన ఉండటమనేది ఆశ్చర్యం కలిగిస్తోందని విశ్వహిందూ పరిషత్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపారు. ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అవగామన పెంచేందుకు, హిందూ సంస్కృతి గొప్పతనాన్ని చాటిచెప్పేందుకు ఇదే మంచి సమయం అని పేర్కొన్నారు.
Tags:    

Similar News