• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ సర్కార్ కీలక...

జగన్ సర్కార్ కీలక నిర్ణయం... ఇసుక ఇకపై నేరుగా కొనుక్కొవచ్చు !

By - Tupaki Desk
Update: 2021-04-17 07:30 GMT
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఇసుక పాలసీలో కీలక సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా ఇకపై ఇసుక కావాలనుకునేవారు ఇకపై నేరుగా కొనుగోలు చేయవచ్చు. కొత్తగా ఇసుక తవ్వకాలు, అమ్మకాలు చేపట్టబోతున్న కాంట్రాక్టరు ఆఫ్‌ లైన్‌ ద్వారా ఇసుక విక్రయాలు జరుపాలని స్పష్టం చేసింది. ఎవరైనా నేరుగా ఇసుక రీచ్, స్టాక్ యార్డ్‌కు వెళ్లి, ఇసుక నాణ్యతను పరిశీలించుకున్న తరువాత అక్కడే నగదు చెల్లించి ఇసుక తీసుకోవచ్చునని తెలిపింది.  అయితే సమీపంలోని ప్రజలు ఇప్పటివరకు ఎడ్ల బళ్లతో పాటు ట్రాక్టర్లలో ఉచితంగా తీసుకెళ్లే అవకాశం ఉండేది. ఇప్పుడు ట్రాక్టర్లను తొలగించింది. కేవలం ఎడ్ల బళ్లలో మాత్రమే సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లాలని స్పష్టంచేసింది.

గతంలో ఇసుక రీచ్ ఉన్న గ్రామాల ప్రజలు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లే ఇసుకకు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు ఆ జాబితా నుంచి ట్రాక్టర్ ‌ను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం. ట్రాక్టర్ ద్వారా ఇసుక తరలిస్తే డబ్బు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. మరోవైపు, ఇసుక కాంట్రాక్టర్ ప్రతీ రీచ్‌ కు సరిహద్దులు ఏర్పాటు చేసుకోవాలని స్పష్టంచేసింది. ప్రభుత్వ బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణం, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ పనులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలి. దీనికి కూపన్ల విధానం అమలుచేయాలని తెలిపింది.  అలాగే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్టాక్ యార్డులో ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపింది. ఇక ఇసుక కొనుగోలు చేసే ప్రతీ కొనుగోలు దారుకు సంబంధిత బిల్లులు, వాహనం నెంబర్‌తో సహా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇసుక తవ్వకాల విషయంలో గనుల శాఖ నిబంధనలను కచ్చితంగా పాటించాలంది. ఇక ఇసుక రీచ్ కాంట్రాక్ట్ పట్టిన కాంట్రాక్టర్, ఇసుకను రాష్ట్రంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చునని తెలిపింది. ఇసుక అక్రమాలపై జిల్లా కలెక్టరు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించింది.
Tags:    
  • CM YS Jagan 
  • Andhra Pradesh 
  • Ap People 
  • Telugu News 

Similar News

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

డెమోక్రాట్లు గెలిచారు కదా.. ట్రంప్ ను దించేయవచ్చా?

2026-11-06 03:56 GMT

పట్టు సాధించిన కొణతాల...బెర్త్ కన్ఫర్మ్ ?

2026-11-06 03:50 GMT

వంగవీటి పట్టాభిషేకానికి మెగాస్టార్...బాలయ్య ?

2026-11-06 03:50 GMT

కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !

2026-11-06 03:49 GMT

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

2026-11-06 03:47 GMT

రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తే జీతం ఇచ్చేస్తారంట..!

2026-11-06 01:50 GMT

ఆ రెండు జెడ్పీల మీదనే హాట్ డిస్కషన్ !

2026-11-06 01:50 GMT

విజయ్ జగన్ కేటీఆర్...ఒకే ఫ్రేమ్‌ లో !

2026-11-06 01:43 GMT

ఆధార్ ప్లేసులో ఓటర్ ఐడీ.. కేంద్రం మరో దుమారం?

2026-11-05 16:15 GMT

పాక్ పై కొట్టింది కానే కాదట.. విరాట్ కోహ్లీ బెస్ట్ వన్డే ఇన్నింగ్స్ లు ఏవో తెలుసా?

2026-11-05 16:14 GMT

ఏపీ ఎన్నిక‌ల్లో ఒక విషాదం.. మ‌రిన్ని చిత్ర విచిత్రాలు!

2026-11-05 16:12 GMT

Copyright @2026

Powered by Blink CMS