సుప్రీం తీర్పు పై ఏపీ డిప్యూటీ సీఎం బాషా కీలక వ్యాఖ్యలు

Update: 2019-11-09 07:36 GMT
చారిత్రాత్మక తీర్పు ను వెల్లడించింది దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు. అయోధ్య  లోని వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని రామ జన్మభూమి న్యాస్ కు అప్పగించాలని.. మసీదు కోసం అయోధ్య లోనే ఐదు ఎకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే.

ఈ తీర్పు పై ఇప్పుడిప్పుడే స్పందనలు వస్తున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా రియాక్ట్ అయ్యారు. కోర్టు తీర్పును గౌరవిస్తామని ముస్లింలంతా ముందు నుంచే చెబుతున్నారని గుర్తు చేశారు.అందరూ సంయమనం పాటించాలని.. మనమంతా సోదరులమని వ్యాఖ్యానించారు. కీలకమైన వేళ.. ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్య ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.
Tags:    

Similar News