స‌మ‌తామూర్తిని ద‌ర్శించిన సీఎం జ‌గ‌న్‌.. ఏమ‌న్నారంటే!

Update: 2022-02-07 18:09 GMT
సమతామూర్తి.. భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. హైద‌రాబాద్ శివారులో ఉన్న‌ ముచ్చిం తల్లో నిర్వహిస్తున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం.. సమాజంలో అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు ఎంతో కృషిచేశారని అన్నారు.   వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేసుకున్నారు.  ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామికి జగన్ అభినందనలు తెలిపారు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలని అన్నారు.

అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకు సమతామూర్తిని స్థాపించారన్నారు. సమతామూర్తి భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. "అసమానతలు రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషిచేశారు. వెయ్యేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామికి అభినందనలు. రామానుజ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్లాలి. అందరూ సమానులే అనే సందేశం ఇచ్చేందుకు సమతామూర్తిని స్థాపించారు. సమతామూర్తి భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది.`` అని జ‌గ‌న్ పేర్కొన్నారు.

సంప్రదాయ దుస్తుల్లో ప్రవచన మండపానికి వచ్చిన సీఎం జగన్.. చినజీయర్ స్వామి సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానం కార్యక్రమాన్ని వీక్షించారు. కార్యక్రమం అనంతరం ఆధ్యాత్మిక వేత్త జూపల్లి రామేశ్వరావు ముఖ్యమంత్రి జగన్కు రామానుజాచార్యుల ప్రతిమను బహూకరించారు. రామానుజాచార్యులు సమానత్వం కోసం పోరాడి విజయం సాధించారని జ‌గ‌న్ చెప్పారు. దేశంలో సమాజ సేవ.. మంచి జరగాలని ఆకాంక్షించారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని వర్గాలకు క్షేమం జరగాలన్నారు. సమతా స్ఫూర్తిని సమాజానికి అందించాలన్నారు. సమతా విశేషాలు ఇక్కడి నుంచి అందించేందుకు కృషి చేస్తామన్నారు.
Tags:    

Similar News