కరోనా మాటున ముంచుకొస్తున్న జాతి వివక్ష ముప్పు!

Update: 2020-05-08 15:00 GMT
ప్రపంచ మానవాళికి పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారి తాజాగా ద్వేషం, జాతివివక్ష సునామీకి తెరలేపుతోందంటూ ఐక్య రాజ్య సమితి (ఐరాస) ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి పరిస్థితిని నిర్ములించేందుకు సర్వశక్తులూ ఉపయోగించాల్సిన అవసరం ఉందని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ పేర్కొన్నారు. అయితే ఆయన ఈ విషయంలో ఏ దేశాన్ని పేరెత్తి ప్రసావించలేదని బీబీసీ తెలిపింది. కరోనా మహమ్మారి కారణంగా ప్రత్యేకించి వలస కార్మికులు, శరణార్ధులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఐరాస చీఫ్ తెలిపారు.

వైరస్ వ్యాప్తి చేస్తున్నారంటూ అవమానాలు ఎదుర్కోవడమే కాకుండా వీరంతా కనీసం చికిత్సకు నోచుకోవడం లేదన్నారు. జాత్యాంహకారం - ద్వేషం సహా ప్రమాదక సమాచారాన్ని తొలగించాలంటూ మీడియా సంస్థలన్నిటినీ ఆయన అభ్యర్థించారు. ఆన్ ‌లైన్లో నకిలీ వార్తలు నిత్యం వ్యాప్తిచెందుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలు డిజిటల్ అక్షరాస్యతపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా బాధితుల సంఖ్య 40 లక్షలకు చేరువవుతున్న వేళ ఐరాస చీఫ్ ఈ మేరకు ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం.

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 38.5 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... ఒక్క అమెరికాలోనే ఈ సంఖ్య 12.5 లక్షలుగా ఉంది.కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 2.7 లక్షల మంది మరణించారు. అత్యధికంగా అమెరికాలో 75,670 మంది ప్రాణాలు కోల్పోగా.. యూకేలో 30,689 మంది చనిపోయారు. ఇటలీలో 29,958 మంది, స్పెయిన్‌లో 26,070 మంది మృత్యువాత పడ్డారు.
Tags:    

Similar News