సోనియాగాంధీ కుటుంబ ఆస్తులపై మరో విచారణ
కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రతిపక్ష కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారత్ -చైనా సరిహద్దు ఘర్షణ అనంతరం పీఎం మోడీ కేర్ కు చైనా నుంచి విరాళాలు అందాయని సోనియా, రాహుల్ గాంధీ విమర్శించారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కు కూడా అందాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్రమంత్రి రవిశంకర్ ఆరోపించారు. ఈ క్రమంలోనే చైనాకు మోడీ లొంగిపోయారని రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. సైనికుల మృతిపై ఇరుకునపెట్టారు. పరస్పర నిధుల గోల్ మాల్ ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఈ కాంగ్రెస్ పౌండేషన్ల విరాళాలపై నిగ్గు తేల్చేందుకు ఈ ప్రత్యేక కమిటీ వేసి షాక్ ఇచ్చింది.
ఇప్పటికే సోనియా గాంధీ కుటుంబానికి చెందిన రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్ట్, ఇందిరాగాందీ మెమోరియల్ ట్రస్ట్ లకు వచ్చే మనీ ల్యాండరింగ్ నిధుల్లో మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ), ఆదాయపు పన్ను చట్టం, విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘించినట్టుగా వచ్చిన ఆరోపణలపై బీజేపీ ఒక కమిటీని ఏర్పాటు చేసి మరీ విచారిస్తోంది.
ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ కుటుంబానికి మరో షాకిచ్చింది. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చీప్ గా కొల్లగొట్టిన ఆస్తులపై సమగ్ర విచారణకు బీజేపీ నేతృత్వంలోని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. 2004-2014 మధ్య కాంగ్రెస్ సీఎం హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కారుచౌకగా కట్టబటెట్టిన ఆస్తులపై విచారణకు ఆదేశించింది.
గురుగ్రాంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా కుటుంబానికి చెందిన ‘అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కేటాయించిన ఫ్లాట్లపైన ఆరాతీస్తున్నారని సమాచారం.
కాగా తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని.. బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ సీఎం హుడా ఆరోపణలను ఖండించారు.