రైల్వే ప్రయాణికుల నెత్తిన మరో భారం.. మోడీ సర్కారు కొత్త నిర్ణయం?
వడ్డనలు కొత్త ఎలా ఉండాలి? అన్న విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే.. మోడీ సర్కారును సునిశితంగా అధ్యయనం చేస్తే విషయం ఇట్టే అర్థమైపోతుంది. గతానికి భిన్నంగా మారిన దేశ ప్రజల మైండ్ సెట్ ను తనకు అనుకూలంగా మార్చుకోవటంలో మోడీ సర్కారు సక్సెస్ అవుతోంది. తగినంత సదుపాయాలు కల్పించండి.. అవసరమైతే.. ఆ మేరకు ఛార్జీలు వసూలు చేయండన్న సెక్షన్ దేశంలో పెరుగుతోంది.
ఇలాంటి వారు.. సోషల్ మీడియాను ప్రభావితం చేసే సామర్థ్యం ఉండటం ప్రభుత్వాల పని మరింత సులువు అవుతోంది. కొత్తగా ప్రజల నుంచి పిండుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఐడియాలు వేసే మోడీ సర్కారు.. తాజాగా మరో కొత్త ఛార్జీలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటివరకు విమానాశ్రయాల్లో మాత్రమే వసూలు చేసే యూజర్ చార్జీలు.. రానున్న రోజుల్లో పేదోడి ప్రయానమైన రైల్వేస్టేషన్లలోనూ అమలు చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే.. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలో కాకుండా.. ఎంపిక చేసిన చోట మాత్రమే ఈ చార్జీల్ని విధించనున్నారు.
ఎందుకిలా అంటారా? అక్కడికే వస్తున్నాం. దేశంలో కొన్ని ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తగ్గట్లే ప్రణాళికల్ని సిద్ధం చేసింది రైల్వే శాఖ. మరి.. అన్ని సదుపాయాల్ని అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడు.. అందుకు తగ్గట్లు ఖర్చు అవుతుంది కదా? అలా ఖర్చు చేసిన మొత్తాన్ని ప్రజల నుంచి వెనక్కి తీసుకోవాలని భావిస్తున్న కేంద్ర సర్కారు.. సదరు రైల్వే స్టేషన్లలో ప్రయాణించే ప్రయాణికుడి ఛార్జీల్లో ఈ యూజర్ ఛార్జీల్ని కలిపి తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.
అయితే.. ఎయిర్ పోర్టుల్లో మాదిరి యూజర్ ఛార్జీలు భారీగా ఉండవని.. నామ మాత్రంగా ఉంటాయని భరోసా ఇస్తున్నారు. నిజమే.. ఆరంభమే అదిరిపోయేలా చార్జీల వాత పెడితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. నామమాత్రంగా మొదలు పెట్టి.. అంతకంతకూ పెంచుకుంటూ పోతే.. అలవాటైన ప్రాణానికి ఫర్లేదులే అన్న భావన కలుగుతుంది. అయితే..కొన్ని రైల్వే స్టేషన్లలో విధించే యూజర్ ఛార్జీలు.. కేవలం వాటిని వాడుకునే ప్రయాణికుల నుంచి మాత్రమేనని రైల్వే బోర్డు ఛైర్మన్ వివరణ ఇస్తున్నారు. ఒక వసతి ఏర్పాటు చేసిన తర్వాత.. వాటిని అందరూ వాడుకోవాలని భావిస్తారు.అలా అనుకున్నంతనే అందరూ యూజర్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఏమైనా.. ఏ సౌకర్యమైనా.. ఉచితంగా రాదన్న విషయాన్ని అర్థమయ్యేలా మోడీ సర్కారు చేస్తుందని చెప్పక తప్పదు.