ఢిల్లీ వేదికగా సుజనాతో సోము వీర్రాజు ఫైట్.. ఇక తాడోపేడో
ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలుస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీ నేతలను ఏకతాటిపైకి తెచ్చే క్రమంలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపే చర్యలకు ఉప్రకమించారు.
ఈ క్రమంలోనే బీజేపీలో ఉంటూ టీడీపీకి వంతపాడుతున్న లంకా దినకర్ సహా మరికొందరికీ షాకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. లంకా దినకర్ స్వయంగా సుజనా చౌదరి ప్రియ శిష్యుడు కావడంతో ఇది సుజనాకు చెక్ పెట్టే చర్యగానే రాజకీయ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. టీడీపీ అనుకూల చానెళ్లలో లంకా దినకర్ ఇష్టానుసారంగా టీడీపీకి వంతపాడడమే ఈ నోటీస్ కు కారణంగా తెలుస్తోంది. ఇక సుజనా చౌదరి కూడా అమరావతి అంశంపై పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడడంపై కూడా సోము వీర్రాజు కేంద్రం పెద్దల దృష్టికి తీసుకొచ్చినట్టు సమాచారం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోము వీర్రాజు భేటి కానున్నారు. పార్టీలో ఉంటూ ధిక్కార స్వరాలను వినిపించే నేతలపై అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తప్పవనే సంకేతాలు ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. తనకు స్వేచ్ఛ కల్పించాలని సోము అధిష్టానాన్ని ప్రతిపాదిస్తున్నట్టు సమాచారం.
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదని.. అసలీ వ్యవహారంతో కేంద్రానికి సంబంధమే లేదని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు.
సోము వీర్రాజుకు కౌంటర్ గా బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బిల్లులపై నిర్ణయం తీసుకోబోయేది కేంద్రమే కదా అంటూ కౌంటర్ ఇచ్చారు. సోము ప్రకటనకు విరుద్ధంగా సుజనా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది.
దీంతో సుజనా శిష్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేసిన సోము వీర్రాజు ఇప్పుడు సుజనాపై కేంద్రం వద్ద తాడోపేడో తేల్చుకునేందుకే రెడీ అవుతున్నట్టు పరిణామాలను బట్టి తెలుస్తోంది.