• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బాబూ... ఈ తల్లి మాటలు...

బాబూ... ఈ తల్లి మాటలు విను

By - Tupaki Desk
Update: 2018-11-11 06:00 GMT
ఓ తల్లి ఆవేదన. ఓ తల్లి ఆందోళన. ఓ తల్లి సంయమనం. ఇవన్నీ ఎవరి గురించి అనుకుంటున్నారా. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గురించే. మాజీ ముఖ్యమంత్రి భార్యగా - ప్రతిపక్ష నేత తల్లిగా ద్విముఖ పాత్రను పోషించిన - పోషిస్తున్న విజయమ్మ ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన తీరు అందరినీ విశేషంగా  ఆకట్టుకుంది. ఒక తల్లిగా తన కుమారుడిపై జరిగిన హత్యాయత్నంపై విజమయ్మ ప్రతిస్పందన టీవీల్లో చూసిన వారందరికి కంటతడి పెట్టించింది. కాంగ్రెస్ పార్టీ - తెలుగుదేశం పార్టీలు తన కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విజయమ్మ తన కుమారుడి వెనుక ప్రజలు ఉన్నారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడిని ఈ విధంగా ఇబ్బందులకు గురి చేసిన దాఖలాలు లేవన్న విజయమ్మ తన కుమారుడి పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న చర్యలపై కన్నీళ్లతోనే ప్రశ్నల వర్షం కురిపించారు. 16 నెలల పాటు జైలులోను - మూడున్నరేళ్లుగా ప్రజల్లోనూ ఉన్న తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి తనకు - తన భార్య పిల్లలకు కూడా దూరంగా ప్రజల మధ్యనే ఉంటున్నాడని చెప్పారు. ఈ వ్యాఖ్యల వెనుక ఓ తల్లి ఆవేదన దాగి ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే భర్తను పోగొట్టుకున్న తాను మరో కష్టానికి మానసికంగా - శారీరికంగా సిద్ధంగా లేనని కన్నీళ్ల మధ్య వెల్లడించారు.

జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొవాలే తప్ప ఆయన కుటుంబ సభ్యులను కూడా వెంటాడడం ఎలాంటి రాజకీయమని విజయమ్మ ప్రశ్నించారు. "జగన్ భార్యను వదలడం లేదు. తల్లినైన నన్ను వదలడం లేదు. తన చెల్లెలు షర్మిలను వదలడం లేదు. ఇలా కుటుంబ సభ్యులందరిపైనా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు " అని విజయమ్మ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా సానుభూతి వ్యక్తం అవుతోంది. " ఓ తల్లిగా విజయమ్మ ఆవేదన అందరికి కన్నీళ్లు తెప్పించింది. రెండు చేతులతో నమస్కరిస్తూ నా కడుపు కొట్టకండి అంటూ కన్నీళ్లతో వేడుకున్న తీరు ప్రతి ఒక్కరిని కలచివేసింది" అని ఓ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డిని ప్రజలే కంటికి రెప్పలా కాపాడుకుంటారని - ఇందుకు నిదర్శనమే మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర అని విజయమ్మ ప్రజలకు తమ కుటుంబంపై ఉన్న అభిమానాన్ని వెల్లడించారు. ప్రజలే తన కుటుంబసభ్యులుగా మార్చుకున్న జగన్ మోహన్ రెడ్డిపై ముందుముందు ఎలాంటి హత్యాయత్నాలు చేయవద్దంటూ వేడుకున్న తీరు అందరినీ కలచివేసింది.  


Tags:    
  • Andhra People 
  • Jagan 
  • YS Vijayamma 
  • Telugu NEws 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS