• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  మోడీ మ‌న‌సు గెలిచిన బాబు

మోడీ మ‌న‌సు గెలిచిన బాబు

By - Tupaki Desk
Update: 2015-10-05 05:54 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ మాన‌స‌పుత్రిక అయిన దేశ‌వ్యాప్త ఎల్ ఈడీ బ‌ల్బుల వినియోగంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంది. ఎల్‌ఈడీ బల్బుల పంపిణీలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత ఏడాది అక్టోబర్‌ 2న దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ పథకం కింద ఇప్పటి వ‌ర‌కు ఆయా రాష్ర్టాల్లో పంపిణీ చేసిన వివ‌రాలు ఆరాతీయ‌గా ఏపీ టాప్‌ లో నిలిచింది. తాజా లెక్క‌ల ప్ర‌కారం రాష్ట్రంలో 56,61,091 బల్బులను పంపిణీ చేసి ప్ర‌థ‌మ స్థానంలో నిలిచారు. మిగిలిన రాష్ట్రాల్లో ఈ స్థాయిలో పంపిణీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో 56,61,091 బల్బులను సరఫరా చేయగా...దేశ రాజ‌ధాని ఢిల్లీలొ 29,87,749 - ఉత్తరప్రదేశ్ లో 24,68,248 - రాజస్థాన్ లో 22,98,096 - మహారాష్ట్రలో 17,15,096 బల్బులు అందజేశారు. ఇదిలాఉండ‌గా... వీధి దీపాలకు ఎల్‌ ఈడీ బల్బులను అమర్చడంలోనూ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇప్పటిదాకా 1,92,575 ఎల్‌ ఈడీ బల్బులను వీధి దీపాలకు అమర్చారు. ఈ సంఖ్య రాజస్థాన్‌-72,249 - ఢిల్లీ-28,200 - ఉత్తరప్రదేశ్‌-11,465లుగా ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్రంలో అన్ని గృహావసర విద్యుత్‌ వినియోగదారులకు మొత్తం రెండు కోట్ల బల్బులను పంపిణీ చేయాలని డిస్కమ్‌లు నిర్ణయించిన విషయం తెలిసిందే.

గ‌త ఏడాది అక్టోబ‌రులో తొలిదశలో గుంటూరు - అనంతపురం - శ్రీకాకుళం - పశ్చిమ గోదావరి జిల్లాల్లో 56 లక్షల బల్బులను డిస్కమ్‌ లు పంపిణీ చేశాయి. మలి దశలో చిత్తూరు - ప్రకాశం - కృష్ణా - విజయనగరం - విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కో ఇంటికీ రెండు చొప్పున ఎల్‌ ఈడీ బల్బులను అందజేస్తున్నారు. ఆయా జిల్లాల్లో బల్బుల పంపిణీ ఇంకా కొనసాగుతోంది. మూడోదశలో కడప - కర్నూలు - తూర్పు గోదావరి - నెల్లూరు జిల్లాలకు బల్బులను పంపిణీ చేయనున్నారు. ఇప్పటిదాకా ఏడు వాట్ల సామర్థ్యం గల బల్బులను పంపిణీ చేసిన డిస్కమ్‌ లో మలి విడతలో తొమ్మిది వాట్ల బల్బులను అందజేయనున్నాయి. దీనికోసం మొత్తం 1.45 కోట్ల బల్బులను సేకరించడానికి టెండర్లను నిర్వహిస్తోంది.
Tags:    
  • Andhra 
  • LED Bulbs 
  • Telugu NEWs 

Similar News

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

Copyright @2026

Powered by Blink CMS