అమరావతిలో ఆంధ్రాబ్యాంక్ బోణీ

Update: 2015-09-09 04:44 GMT
పేరులో ఆంధ్రాతనం ఉట్టిపడే సంస్థలు చాలా తక్కువే. అలాంటి వాటిల్లో మొదటి స్థానం ఆంధ్రాబ్యాంక్ దే. కేవలంలో పేరులో ఉన్న ఆంధ్రా కారణంగా ఆ సంస్థకు ఎన్ని ఇబ్బందులు పడిందో చెప్పాల్సిన అవసరం లేదు. జాతీయ బ్యాంకు అయినా.. పేరులో ఆంధ్రా అని ఉండటంతో ప్రాంతీయ విభేధాలు ఎక్కడ చోటు చేసుకున్నా.. ఆందోళనకారులకు ఈ బ్యాంకు టార్గెట్ అయ్యేది.

హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఆంధ్రా బ్యాంక్ భాగ్యనగరి నుంచి బయటకు వెళ్లే దిశగా అడుగులు వేస్తుందని చెబుతున్నారు. ఆంధ్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని నగరంగా చెబుతున్న అమరావతికి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు సాగుతున్నాయి.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఆంధ్రాబ్యాంక్ జీఎం గుప్తా.. ఆంధ్రాబ్యాంక్ ను అమరావతికి షిఫ్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. బ్యాంకుకు చెందిన కొన్నిశాఖల్ని అమరావతికి తరలించనన్నట్లుగా బ్యాంక్ జీఎం చెబుతున్నారు. ఏపీ రాజధానిని ఆర్థిక రాజధాని మార్చే క్రమంలో ఆంధ్రా బ్యాంక్ ప్రధాన కార్యాలయం తరలింపు మొదటి అడుగుగా చెబుతున్నారు. మరి.. ఏపీ రాజధాని అమరావతికి తరలివస్తున్న మొదటి బ్యాంక్ ఆంధ్రా బ్యాంక్ గా చెప్పాలి. మరి.. ఈ బ్యాంక్ బోణి ఎలా ఉంటుందో చూడాలి.
Tags:    

Similar News