హైదరాబాద్ ఇమేజ్ పెంచే విషయాన్ని చెప్పిన ఆర్థిక సర్వే

Update: 2022-02-01 04:41 GMT
కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టటానికి ముందు రోజు పార్లమెంటులో ప్రవేశ పెట్టే ఆర్థిక సర్వేను తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశ పెట్టటం తెలిసిందే. దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని తెలియజేసిన నిర్మలమ్మ..  తన సర్వే రిపోర్టులోని అంశాల్ని వెల్లడించే క్రమంలో హైదరాబాద్ మహానగరం రేంజ్ ఎంతన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పేయటం గమనార్హం.  అత్యధిక గృహ లావాదేవాలు జరుగుతున్న టాప్ 8 నగరాల్లో హైదరాబాద్ ఉన్నట్లుగా సర్వే వెల్లడించింది.

కొవిడ్ ముందు ఉన్న పరిస్థితులతో పోలిస్తే.. రెండో దశలో హైదరాబాద్ లోని ఇళ్ల ధరలు.. లావాదేవీలు భారీగా పెరిగినట్లుగా ఆర్థిక సర్వే వెల్లడించింది. లావాదేవీలు హైదరాబాద్ లో పెరిగినట్లుగా చెప్పిన ఆర్థిక సర్వే.. దేశంలోని ముంబయి.. థానే.. పుణె.. నోయిడా.. బెంగళూరు నగరాల సరసన భాగ్యనగరి నిలిచినట్లు చెప్పారు. అదే సమయంలో.. గాంధీ నగర్.. అహ్మదాబాద్.. చెన్నై.. రాంచీ.. ఢిల్లీ.. కోల్ కతాల్లో మాత్రం లావాదేవీలు తగ్గాయి.

ఇదిలా ఉంటే.. కొవిడ్ తీవ్రత కొనసాగుతున్నప్పటికి దేశంలోని కొన్ని నగరాల్లో ఇళ్ల ధరలు పెరుగుతున్నట్లుగా పేర్కొంది. అలాంటి నగరాల్లో హైదరాబాద్.. గాంధీనగర్.. అహ్మదాబాద్.. రాంచీ లలో ఇళ్ల ధరలు పెరిగినట్లుగా ఆర్థిక సర్వే వెల్లడించింది.  2019 ఏప్రిల్ -జూన్ మధ్యకాలంలో ఇంటి లావాదేవీల్ని పోలిస్తే.. మొదటి వేవ్ (2020 ఏప్రిల్ - జూన్)లో 37.6 శాతం తగ్గితే.. రెండో వేవ్ వేళలో కు (2021 ఏప్రిల్ -జూన్)  37.9 శాతం పెరిగాయి.

ఇదిలా ఉంటే కరోనా మొదటి వేవ్ వేళలో ఇళ్ల ధరలు కేవలం 12.3 శాతం పెరిగితే.. కరోనా రెండో వేవ్ నాటికి 21.3 శాతం పెరిగాయి. తాజాగా చూస్తే.. గాంధీనగర్.. అహ్మదాబాద్ తర్వాత గృహాల ధరల పెరుగుదల ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉన్నాయి.
Tags:    

Similar News