షా పాజిటివ్.. మోడీ టీం మొత్తానికి కరోనా డేంజర్?

Update: 2020-08-03 05:45 GMT
ఎత్తులకు పైఎత్తులు ఆటల్లోనే కాదు రాజకీయాల్లో కామన్. కానీ..కరోనాతో అలాంటి ఆటలు చాలా ఖరీదైనవి. ఆ విషయాన్ని మర్చిపోతున్న వారంతా ఇప్పుడు ఇబ్బందికి గురి అవుతున్నారు. పాజిటివ్ గా తేలిన వారి పుణ్యమా అని.. వారికి దగ్గగా ఉన్నవారు.. వారిని కలిసిన వారు.. సన్నిహితంగా మెలిగిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే కేంద్రంలోని మోడీ సర్కారు టీం ఎదుర్కొంటోంది.

కేంద్రంలోని గుండెకాయ లాంటి పోస్టులో ఉన్న హోంమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్ గా తేలటం తెలిసిందే. దీంతో మోడీ టీం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆదివారం సాయంత్రం వేళలో అమిత్ షాకు పాజిటివ్ అన్న విషయం బయటకు వచ్చి షాకింగ్ గా మారింది. ఇది కాస్తా వైరల్ గా మారింది. దీనికి ఒక రోజు ముందే.. అమిత్ షా కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పుల్ టీం పాల్గొన్నట్లుగా చెబుతున్నారు.

దీంతో బీజేపీ పరివారానికి కొత్త టెన్షన్ మొదలైంది. అయితే.. భౌతిక దూరాన్ని పక్కాగా పాటిస్తూ మంత్రివర్గ సమావేశం జరగటంతో ఎలాంటి ఇబ్బంది లేదన్న మాట వినిపిప్తోంది. అయితే.. మంత్రివర్గంలోని వారిలో ఎక్కువమంది పెద్ద వయస్కులు ఉండటం.. అప్పటికే ఉండే ఆరోగ్య సమస్యల నేపథ్యంలో మిగిలిన వారి మాదిరి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండదని చెబుతున్నారు.

మరోవైపు.. అలాంటి ఆందోళనలు అక్కర్లేదని.. ఎవరికి ఏమీ కాదన్న భరోసాను మరికొందరు వినిపిస్తున్నారు. ఏది ఏమైనా.. కరోనా విషయంలో కాస్త కరకుగా ఉంటేనే మంచిది. ప్రస్తుతానికి షాకు పాజిటివ్ అని తేలిన నేపథ్యంలో వీలైనంతవరకు మోడీ టీం మొత్తం హోం ఐసోలేషన్ లో ఉండటం అవసరమన్న మాట వినిపిస్తోంది.  
Tags:    

Similar News