• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అమ్మ తర్వాత చిన్నమ్మేన‌ట‌

అమ్మ తర్వాత చిన్నమ్మేన‌ట‌

By - Tupaki Desk
Update: 2016-12-11 06:08 GMT
త‌మిళ‌నాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో క్లారిటీ వ‌చ్చేసిన‌ట్లే ఉంది. అమ్మ త‌ర్వాత చిన్నమ్మ శ‌శిక‌ళేనన్న‌ది  అన్నాడీఎంకే పార్టీలో సీనియర్ నేతలు ప్రస్తుతం కోరస్‌గా వినిపిస్తున్న డిమాండ్. సీఎం ప‌న్నీర్ సెల్వంతో సహా పార్టీనేతలు ఆమెను కలుసుకోవడంలో తప్పులేదని అధిష్ఠానం స్పష్టం చేసింది. ఇక ప్రధాన కార్యదర్శి పీఠం మీద అమ్మ ఒకప్పటి సహాయకురాలు అధిష్ఠించడం కేవలం లాంఛనమే అంటున్నారు. అన్నాడీఎంకే పార్టీ అధినేతగా శశికళ ఎన్నికయ్యే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తున్నది.

అన్నాడీఎంకేలో నాయకత్వం కోసం కుమ్ములాట ఏదీ జరుగడం లేదని, సీఎంతో సహా పార్టీ నేతలు శశికళను కలుసుకోవడంలో ఎలాంటి తప్పులేదని సంస్థాగత కార్యదర్శి సీ పొన్నయ్యన్ చెప్పడమే ఇందుకు నిదర్శనం. ఆమెకు మాత్రమే పార్టీని నడిపించే సత్తా ఉందని సెంగోటయ్యన్ వంటి సీనియర్ నేతలు బాహాటంగానే శశకళకు మద్దతు తెలుపుతున్నారు. 30 ఏళ్లుగా అమ్మను కనిపెట్టకుని ఉన్న చిన్నమ్మ పార్టీ బాధ్యతలు చేపట్టాలని వలర్మతి అనే సీనియర్ మహిళా నేత ప్రకటించారు. అమ్మలో చిన్నమ్మను చూస్తున్నామని పార్టీ నేతలు చెప్తున్నారు. అన్నాడీఎంకే అధ్యక్ష వర్గ చైర్మన్ ఈ మధుసూదనన్, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై శ‌శికళను కలుసుకొని పార్టీ నాయకత్వాన్ని చేపట్టాల్సిందిగా కోరారు. దివంగత తమిళ సీఎం జయలలిత సహాయకురాలు శశికళ చేతికి అన్నాడీఎంకే పార్టీపగ్గాలు అప్పగించాలని సీనియర్ నేతలు కోరుకుంటున్నారని పార్టీ త‌ర‌ఫున‌ ట్విట్టర్ సందేశంలో పేర్కొనడం విశేషం. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు పొన్నయ్యన్ సమాధానమిస్తూ, ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.. త్వరలో ఎన్నిక జరుగుతుంది అని చెప్పారు.

ఇటీవల మంత్రులు కొందరు శశికళను కలుసుకున్న సంగతిని ప్రస్తావిస్తే అందులో తప్పేముందని పార్టీ అధికార ప్రతినిధి కూడా అయిన పొన్నయ్యన్ ఎదురు ప్రశ్న వేశారు. శశికళ భర్త నటరాజన్, ఇతర కుటుంబ సభ్యు లు పోషిస్తున్న పాత్ర గురించి అడిగితే ఇది అనవసరమైన ప్రశ్న అంటూ విసుక్కున్నారు. అన్నాడీఎంకేను అమ్మ ఒక కోటలా నిర్మించారని చెప్పారు. జయలలితకు చెందిన 113.72 కోట్ల విలువ చేసే ఆస్తులకు ఎవరు వారసులు అనే విషయం స్పష్టం కావడం లేదు. జయ ఏదైనా వీలునామా రాశారా? అని అడిగితే పొన్నయ్యన్ స్పందిస్తూ ఈ ప్రశ్నకు సమాధానం తన దగ్గర లేదని చెప్పారు. ఈ విషయమై ఇంతకన్నా చెప్పేదేమీ లేదని అన్నారు. పోయస్ గార్డెన్‌లోని జయ నివాసాన్ని స్మారక కేంద్రంగా మారుస్తారా? అని అడిగితే ఆ సంగతి పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు.
Tags:    
  • All AIDMK Leaders 
  • shasikala 
  • Telugu News 
  • AP Politics 
  • AP Political News 
  • Andhra Politics 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS