30 సెకన్లలోనే వైఫై కనెక్టివిటీ

Update: 2015-07-28 11:34 GMT
నవ్యాంధ్ర రాజధానికి తలమానికమైన గన్నవరం విమానాశ్రయంలో వైఫై సేవలు అందించడానికి రంగం సిద్ధమవుతోంది. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ మేరకు ఇప్పటికే టెండర్లు పిలిచింది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అత్యాధునిక సాంకేతికత సహాయంతో వైఫై సేవలు అందిస్తున్న సంస్థలు ఇందులో పాల్గొననున్నాయి.

నవ్యాంధ్ర రాజధాని నేపథ్యంలో గన్నవరంలోని పాత టెర్మనల్ను అత్యాధునికంగా తీర్చిదిద్దారు. గతంలో వంద మందికి మాత్రమే సరిపోయే టెర్మినల్ ను ఇప్పుడు 500 మందికి అందుబాటులోకి తెచ్చారు. కేవలం లాంజ్ వరకే పరిమితం కాకుండా ఏటీఎంలు, ఎయిర్ లైన్స్, సెక్యూరిటీ వింగ్, కస్టమ్స్, ఇమిగ్రేషన్ విభాగాలకు ప్రత్యేకంగా చోటు కల్పించారు. ఇక్కడే అన్ని విభాగాలకు ఉచిత వైఫై అందించాలని నిర్ణయించారు. కేవలం 30 సెకన్లలోనై వైఫై కనెక్టివిటీ అయ్యేలా చూడాలని టెండర్లలో స్పష్టం చేశారు. కనెక్టివిటీ ఇవ్వడానికి కేవలం రెండే రెండు ప్రశ్నలు మినహా మిగిలిన బాదరబందీ ఏమీ లేకుండా చూడాలని కూడా స్పష్టం చేశారు.
Tags:    

Similar News