2 నెలల్లో టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చేస్తామంటూ మజ్లిస్ ఎమ్మెల్యే షాకింగ్ వ్యాఖ్యలు
సంచలనాలకు కేంద్రబిందువుగా ఉంటూ.. అప్పుడప్పుడు వార్తల్లోకి వచ్చే మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ నోట షాకింగ్ వ్యాఖ్యలు వచ్చాయి. టీఆర్ఎస్ - మజ్లిస్ మిత్రులంటూ భారీ ఎత్తున ప్రచారం జరగటం.. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల్లో దీన్నో ప్రధానాంశంగా బీజేపీ మార్చిన నేపథ్యంలో.. తాజా పరిణామం చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమ పోటీ మజ్లిస్ తోనే అని చెప్పినఆయన.. గత ఎన్నికల్లో మజ్లిస్ ను టీఆర్ఎస్ ను ఐదు చోట్ల ఓడించినట్లుగా చెప్పారు.
తాజాగా ఎన్నికల్లో పది స్థానాలకు పైనే మజ్లిస్ ను ఓడిస్తామని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు ముంతాజ్ ఖాన్. కేటీఆర్ చిన్న చిలుకగా అభివర్ణించిన ఆయన.. రాజకీయాల్లో అలాంటి వారిని చాలామందినే చూశామని చెప్పారు. ‘‘నిన్నగాక మొన్న వచ్చాడు.. ఇలాంటి వారిని చాలామందినే మజ్లిస్ చూసింది. రాజకీయం మా ఇంటి మనిషి. మేం తలుచుకుంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని రెండు నెలల్లో పడగొట్టేస్తాం’’ అంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
దూకుడుగా వ్యవహరించటం.. దుందుడుకు చర్యలకు పాల్పడిన ట్రాక్ రికార్డు ముంతాజ్ ఖాన్ సొంతం. అలాంటి ఆయన.. కేసీఆర్ సర్కారుపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తమ మిత్రపక్షంగా మజ్లిస్ ను కేసీఆర్ పేర్కొనటం తెలిసిందే. టీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లిస్ కు ఓటు వేసినట్లుగా బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.
గ్రేటర్ ఎన్నికల్లో మజ్లిస్ ను బూచిగా చూపించి ఓట్లను కొల్లగొట్టటానికి ప్రయత్నిస్తోందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.. ఇలాంటి పరిస్థితుల్లో మజ్లిస్ తో తమకు పొత్తు లేదని కేటీఆర్ తాజాగా ఇస్తున్న ఇంటర్వ్యూలలో స్పష్టం చేస్తున్నారు. మజ్లిస్ తో అధికారాన్ని పంచుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ‘మేయర్ పదవిని ఎంఐఎంకు ఇవ్వటానికి మాకేమైనా పిచ్చా? గ్రేటర్ మీద మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తాం’ అంటూ స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉంటే.. కేటీఆర్ మాటలకు కౌంటర్ అన్నట్లుగా ముంతాజ్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అయితే.. ఇదంతా రాజకీయ డ్రామాగా కొట్టిపారేస్తున్నారు. తమ మధ్య ఏమీ లేదన్న విషయాన్ని చెప్పేందుకే ఈ తరహా విమర్శలు.. ప్రతి విమర్శలు.. సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఇదంతా ఎన్నికల స్టంట్ గా అభివర్ణించేవారు లేకపోలేదు. ఇవే మాటలు అసదుద్దీన్ఓవైసీనో.. అక్బరుద్దీన్ ఓవైసీ నోటి నుంచో వస్తే సీరియస్ గా తీసుకోవచ్చని.. ముంతాజ్ లాంటి నేత మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. ముంతాజ్ మాటలపై మంత్రి కేటీఆర్ స్పందిస్తే అప్పుడీ అంశాన్ని సీరియస్ గా తీసుకోవచ్చంటున్నారు.