ఇక సెలవు .. ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్

Update: 2021-11-19 08:32 GMT
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌ మెన్‌, 360 డిగ్రీల ఆటగాడు ఏబీ డివిలియర్స్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ కు గుడ్‌ బై చెబుతున్నట్లు కొద్దిసేపటి క్రితమే కీలక ప్రకటన చేశాడు ఏబీ డివిలియర్స్. తన వయస్సు మీద పడిపోయిందని, ఇక ఇప్పటి వరకు క్రికెట్‌ కు సేవలు అందించి, చాలని నిర్ణయం తీసుకున్నానని ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు ఏబీ డివిలియర్స్. అన్ని ఫార్మామెంట్లకు తాను రిటైర్మెంట్‌ ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు ఏబీ డివిలియర్స్.

ఇది ఒక అద్భుతమైన ప్రయాణం, కానీ నేను అన్ని క్రికెట్ నుండి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాను.పెరట్లో మా అన్నయ్యలతో మ్యాచ్ అయినప్పటి నుండి, నేను స్వచ్ఛమైన ఆనందంతో మరియు హద్దులేని ఉత్సాహంతో ఆట ఆడాను. ఇప్పుడు, 37 ఏళ్ల వయస్సులో, ఆ జ్వాల అంత ప్రకాశవంతంగా మండదు అంటూ ట్వీట్‌ చేశారు ఏబీ డివిలియర్స్. 2004 డిసెంబర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌తో డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు మ్యాచ్‌లు ఆడిన డివిలియర్స్ మొత్తం 50 సెంచరీలు, 137 హాఫ్ సెంచరీలు, 2 డబుల్ సెంచరీలు సాధించాడు.
Tags:    

Similar News