70 వేల ఫోన్ ఆర్డర్ చేస్తే విమ్ బార్… బోనస్ గా 5 రూపాయల బిళ్ల !

Update: 2021-10-24 01:30 GMT
ఈ మధ్య కాలంలో తరచుగా ఈ కామర్స్ వినియోగదారులకు పెద్ద పెద్ద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే ఫ్లిప్‌ కార్ట్ నుండి ఫోన్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి సబ్బులు వచ్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ విషయం ఇంకా మరిచిపోక ముందే మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకుంది. కేరళలోని కొచ్చి నగర శివారు అలువా ప్రాంతంలో నివసిస్తున్న నూరుల్ అమీన్ అనే వ్యక్తి ఐఫోన్ 12 ను ఆర్డర్ చేశాడు. అమెజాన్ లో రూ .70,000 విలువైన ఫోన్ ను ఆర్డర్ చేస్తే అతనికి షాకిచ్చింది సదరు సంస్థ.

ఆయనకు ఆర్డర్ డెలివరీ కాగానే ఆతృతగా ఓపెన్ చేసి చూశాడు. అందులో డిష్ వాష్ సబ్బు విమ్ బార్ తో పాటు బోనస్ గా రూ .5 కాయిన్ ఉండడం చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అలాగే పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశాడు. మరింత ఆశ్చర్యకర విషయం ఏమిటంటే… జార్ఖండ్‌ లో ఎవరో నూరుల్ ఆర్డర్ చేసిన ఫోన్‌ను సెప్టెంబర్ 2021 నుండి ఉపయోగిస్తున్నారు. కానీ ఇతను ఆర్డర్ చేసిన అక్టోబర్ 12న. ఆర్డర్ డెలివరీ అయ్యింది అక్టోబర్ 15న. ఈ విషయంపై స్పందించిన సదరు సంస్థ ఈ తప్పు ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని, ప్రస్తుతానికి స్టాక్ అయిపోయిందని, నూరుల్ చెల్లించిన మొత్తం తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. ఇకపై ఇలా ఈ కామర్స్ లో ఏమైనా ఆర్డర్ చేస్తే కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది.

ఇప్పటివరకూ ఇలాంటి మోసాల్లో డెలివరీ బాయ్స్ హస్తం ఉండేది. కానీ ఈసారి అసలు సమస్య ఎక్కడుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అమెజాన్ కంపెనీ నూరుల్ కి సారీ చెప్పింది. తమ దగ్గర కొత్త ఫోన్ స్టాక్ లేదని, పూర్తిగా సొమ్ము రీఫండ్ చేసింది. విచిత్రం ఏంటంటే, నూరుల్ ఆర్డర్ చేసిన ఐఫోన్-12 ఐఎంఈఐ నెంబర్ తో దాన్ని ట్రేస్ చేయగా జార్ఖండ్ లో ఆ ఫోన్ వినియోగిస్తున్నట్టు తేలింది. ఇంకా విచిత్రం ఏంటంటే ఆ ఫోన్ సెప్టెంబర్ నుంచి రన్నింగ్ లో ఉంది. అక్టోబర్ లో ఆర్డర్ ఇచ్చిన ఫోన్, సెప్టెంబర్ లోనే వేరే అడ్రస్ కి డెలివరీ కావడం, దాన్ని ఉపయోగించడం అన్నీ జరిగిపోయాయి. అసలిలాంటి మోసం ఎలా జరిగిందా అని అటు అమెజాన్ నిర్వాహకులు, ఇటు సైబర్ క్రైమ్ పోలీసులు తలలు పట్టుకున్నారు.


Tags:    

Similar News