• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కూతురికి తనవల్లే కరోనా...

కూతురికి తనవల్లే కరోనా సోకిందని ఓ తండ్రి ఎంత పనిచేసాడంటే ?

By - Tupaki Desk
Update: 2020-07-25 13:00 GMT
కరోనావైరస్.. దేశంలో రోజురోజుకి మరింతగా విజృంభిస్తూ, ఎన్నో కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తుంది. అప్పటివరకు ఎంతో ఆపాయ్యంగా ఉన్న కుటుంబాల్లో కరోనా దూరి అతలాకుతలం చేస్తుంది. తాజాగా మరో కుటుంబం కరోనా కాటుకి బలైంది. తన వల్లే రెండు నెలల గర్భిణీ అయిన కూతురికి కరోనా సోకిందేమో అన్న ఆవేదనతో ఓ తండ్రి ఆత్మహత్య కి పాల్పడ్డాడు. ఈ ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకుంది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... రాజమహేంద్రవరం మోరంపూడి చైతన్య నగర్ కు చెందిన 57 ఏళ్ల ఓ జట్టు కూలీ రంభ ఊర్వసి సెంటర్ ఉల్లిపాయల మార్కెట్ లో పనిచేస్తున్నాడు. చాలా కాలం క్రితమే శ్రీకాకుళం జిల్లా నుండి రాజమహేంద్రవరం వచ్చి, ఇక్కడ స్థిరపడి ఇల్లు కట్టుకుని పిల్లల్ని బాగా చదివించుకొని బాగా స్థిరపడ్డాడు. అయినా జట్టు పని మానకుండా వెళ్లి వస్తున్నాడు. అతడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. కూతురు అంటే అతడికి చాలా ఇష్టం. ఆమె రెండు నెలల గర్భిణీ. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. తన వల్లె కుమార్తెకూ కరోనా వచ్చిందని ఆవేదన తో గోదావరి రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో రైలు పెట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న రైల్వే జీఆర్పీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా ఆధార్ కార్డు ఆధారంగా అతడిని గుర్తించారు. అయితే , ఇంకా ఆయనకి కరోనా సోకినట్టు నిర్దారణ కాలేదు. ఈ రోజు శవానికి కరోనా టెస్టు చేయబోతున్నారు.
Tags:    
  • Rajamahendravaram 
  • Father Suicide 

Similar News

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

Copyright @2026

Powered by Blink CMS