269.. గెలుపుకు ఒక్క ఓటు దూరంలో జోబిడెన్

Update: 2020-11-06 15:17 GMT
అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి కాకరేపుతోంది. గంటగంటకు సమీకరణాలు మారుతున్నాయి. ప్రస్తుతం ట్రంప్ కంటే జోబిడెన్ ముందంజలో ఉన్నారు. 28 సంవత్సరాల తర్వాత ఒక డెమొక్రాటిక్ అభ్యర్థి జార్జియా రాష్ట్రంలో లీడ్ లోకి రావడం విశేషం. జార్జియా రాష్ట్రం రిపబ్లికన్ లకు పెట్టని కోట.. అక్కడ ప్రతిసారి రిపబ్లికన్లే గెలుస్తుంటారు. కానీ చివరిసారిగా 1992 లో బిల్ క్లింటన్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు..

తాజాగా డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్ జార్జియాలో కొద్దిపాటి ఆధిక్యత సాధించడం విశేషం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. జార్జియాలో ఉన్న 16 ఎలక్ట్రోరల్ ఓట్లను జోబిడెన్ పొందితే ఇక అధ్యక్షుడు అవ్వడం ఖాయం.

తాజాగా జార్జియా రాష్ట్రంలో లెక్కిస్తున్న ఓట్లలో జోబిడెన్ 917 ఓట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు. బిడెన్ జార్జియాను గెలుచుకుంటే అతని ఎలక్ట్రోరల్ ఓట్ల సంఖ్య 269కు చేరుతుంది. మరో ఒక్క ఓటు వస్తే ఇక అధ్యక్షుడు అయిపోయినట్టే. అమెరికా అధ్యక్షుడిగా కావాలంటే మ్యాజిక్ ఫిగర్ 270.

ట్రంప్ ప్రస్తుతం.. 214 ఎలక్ట్రోరల్ ఓట్లతో వెనుకబడ్డాడు. 270 ఓట్లకు చేరుకోవడానికి జార్జియాలో గెలుపు ట్రంప్ కు అత్యవసరంగా మారింది. కానీ సమీకరణాలు చూస్తే జార్జియాలో ట్రంప్ ను బిడెన్ ఓడించడం పక్కాగా కనిపిస్తోంది. రిపబ్లికన్లు ఇక్కడ పట్టుకోల్పోయే సూచనలు పక్కాగా కనిపిస్తున్నాయి. చట్టం ఆధారంగా జార్జియాలో బిడెన్ - ట్రంప్ మధ్య ఓట్ల శాతం మార్జిన్ కంటే సగం కంటే తక్కువగా ఉంటే రీకౌంట్ అభ్యర్థించవచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందనే త్వరలోనే తేలనుంది.
Tags:    

Similar News