రాజస్థాన్ లో అర్ధరాత్రి 80 అవుల దుర్మరణం ... కారణం ఏంటి !

Update: 2020-11-22 06:45 GMT
రాజస్థాన్ లోని చురు జిల్లా బిల్యుబాస్ గ్రామంలో ఓ దిగ్భ్రాంతికర ఘటన చోటు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా 80 ఆవులు నురగలు కక్కుతూ మృత్యువాత పడ్డాయి. అయితే , దీనికి గల కారణాలు ఏమిటి అనేది మాత్రం వెల్లడికాలేదు. అయితే , ఒకేసారి 80 అవులు మృతి చెందడంతో దీనిపై అధికారులు అరా తీస్తున్నారు. గోశాలతో గోవుల కళేబరాల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షలకు పంపించారు. ఈ నివేదికలు అందిన తరువాతే గోవుల మరణానికి కారణం ఏమిటనేది వెల్లడవుతుందని అధికారులు చెప్పారు.

అక్కడ కొందరు ప్రైవేటు వ్యక్తులు స్థానికంగా గోశాలనునడుపుతున్నారు. పండుగలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో స్థానికులు గోవులకు ఆహారాన్ని అందిస్తుంటారు. ఉత్తరాది పెద్ద పండుగల్లో ఒకటైన ఛాత్ పూజ సందర్భంగా స్థానికులు గోవులకు ఆహారాన్ని అందించారు.  స్థానికులు గోవులకు ఆహారాన్ని ఇవ్వడం గత కొన్నేళ్లుగా  ఆనవాయితీగా వస్తోందని, ఎప్పుడూ ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోలేదని స్థానిక అధికారులు వెల్లడించారు. గోవుల మరణానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరావాల్సి ఉందని, దీనికోసం ఆరా తీస్తున్నామని సర్దార్ షెహర్ తహశీల్దార్ కుతేంద్ర కన్వర్ తెలిపారు. గోవులకు వేసిన దాణా సంబంధించిన నమూనాలను పరీక్షల కోసం పంపించామని వెల్లడించారు. గోశాల నిర్వహణ పరిస్థితులపైనా ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

ఈ ఘటనపై చురు జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశాలు జారీచేశారు. సమగ్ర నివేదికను అందజేయాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని అన్ని గోశాలకు సంబంధించిన వివరాలను అందజేయాలని చెప్పారు. గోశాల నిర్వహణ, పరిసర ప్రాంతాలు, అనారోగ్యకర వాతావరణం వంటి అంశాలతో కూడిన నివేదికను రూపొందించాని అన్నారు. దాణను ఎక్కడి నుంచి తెప్పించారో తెలుసుకుంటున్నామని, వాటిని సరఫరా చేసిన వారిని కూడా విచారించే అవకాశాలు లేక పోలేదని కుతేంద్ర కన్వర్ వెల్లడించారు.
Tags:    

Similar News