ఆంధ్రోళ్లు బీరు తాగటం తగ్గించేశారా?

Update: 2020-05-09 04:50 GMT
మందుబాబులు ఎవరైనా కావొచ్చు.. ఆ అలవాటు మొదలయ్యేది బీరుతోనే. గడిచిన కొద్దికాలంగా బ్రీజర్లు వచ్చాయి కానీ.. గతంలో మందు తాగటం షురూ చేసేది బీరుతోనే. ఇప్పటికి మద్యం తీసుకునే వారిలో ఎక్కువగా బీరు తీసుకోవటం కామన్ గా కనిపిస్తుంది. మిగిలిన మద్యంతో పోలిస్తే.. బీర్ అమ్మకాలు భారీగా కనిపిస్తాయి. అయితే.. ఆంధ్రాలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి ఉందన్న మాట వినిపిస్తోంది.

ఏపీలో బీరు వినియోగం 60 శాతం తగ్గిందని ఏపీ స్టేట్ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాల్ని 20 శాతం తగ్గించారని చెబుతున్నారు. మద్యం షాపుల సమయాన్ని కుదించటం తెలిసిందే.

గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మద్యం వినియోగం 30 శాతం తగ్గిందని.. బీరు విషయానికి వస్తే అది కాస్తా అరవై శాతం తగ్గిందని చెప్పటం విశేషం. సీఎం జగన్ మోహన్ రెడ్డి చెప్పినట్లుగా 2024 నాటికి మద్య నిషేధాన్ని అమలు చేసే ప్రక్రియలో భాగంగా.. మద్యం దుకాణాల్ని తగ్గించటమే కాదు.. భారీగా ధరల పెంపు వెనుక ఉద్దేశం అదేనని చెప్పటం గమనార్హం. ఆంధ్రాలో బీరు అమ్మకాలు తగ్గటానికి కారణం ఏమిటన్న విషయం చెప్పకున్నా.. అమ్మకాలు తగ్గిన తీరు చూస్తే.. ఏపీలో బీరు తాగే వారికి బోర్ కొట్టిందా? అన్న సందేహం కలుగక మానదు.
Tags:    

Similar News