ఇయర్ 2026...అంతా రోడ్ల మీదకే :
అవునా నిజమేనా అంటే కొత్త కేలండర్ దగ్గర పెట్టుకుని కూర్చోవడమే. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 2025 చేప చుట్టేస్తోంది.;
అవునా నిజమేనా అంటే కొత్త కేలండర్ దగ్గర పెట్టుకుని కూర్చోవడమే. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో 2025 చేప చుట్టేస్తోంది. ఎన్నో జ్ఞాపకాలను తనలో దాచుకుని చరిత్ర పుటలలోకి ఎక్కుతోంది. ఇక 2026 ఎంట్రీ ఇస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి ఆశలతో కొత్త ఏడాది కోసం అంతా కాచుకుని కూర్చున్నారు ఇక పోతే రాజకీయ నేతలు ఎపుడూ పెద్దాశలతో ఉంటారు కాబట్టి వారు కొత్త మోజుగానే చూస్తారు. అందుకే ఈ ఏడాది తమ రాజకీయ సిరిని మార్చేస్తుంది అని ఎంతో ధీమా పడుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం చూస్తే దాదాపుగా ఒక్కటిగానే సాగుతోంది. దానికి 2025 చివరిలో కొంత ప్రీ క్లైమాక్స్ గా పొలిటికల్ సీన్లు నడిచాయి.
రాజకీయం మార్చేస్తుందా :
కొత్త ఏడాది ముంగిటలో ఉండగా తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మీడియా ముందుకు వచ్చారు. ఇక రచ్చ మామూలుగా ఉండదని సంకేతాలు ఇచ్చారు కొత్త ఏడాదిలో రంగారెడ్డి పాలమూరు ఇష్యూ మీద మూడు బహిరంగ సభలు పెడతామని చెప్పారు. తాను కూడా వాటిలో పాల్గొంటాను అన్నారు అంతే కాదు ఇక మీదట తాను జనంలోనే ఉంటాను అని సంకేతాలు ఇచ్చారు. రెండేళ్ళే టైం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చామని ఇక మీదట అది కుదిరేది కాదని తాను జనంలోనే తేల్చుకుంటాను అని ఆయన చెప్పేశాక 2026 మీద అంతా ఆసక్తిగా చూడడంలో విశేషమేమీ లేదు.
జగన్ సైతం :
ఇక ఏపీలో సైతం అదే తీరు కనిపిస్తోంది. 2025లో జగన్ పెద్దగా జనంలోకి వచ్చినది లేదు, నిజానికి ఈ ఏడాది సంక్రాంతి తరువాత జిల్లాల టూర్లు అని జగన్ అన్నారు, కానీ అది వాయిదాలు పడుతూ మొత్తానికి ఏడాది ముగిసిపోతోంది. దాంతో 2026లోనే జగన్ కూడా రెడీ అవుతారు అని అంటున్నారు. ఆయన ఈ సంక్రాంతి తరువాత ఆరు నెలల పాటు ఏపీలోని మొత్తం 13 ఉమ్మడి జిల్లాలలో బస్సు యాత్ర పేరుతో జిల్లా టూర్లు చేపడతారు అని అంటున్నారు. సో ఏపీలో కూడా రాజకీయం వేడెక్కుతుంది అన్న మాట.
చంద్రబాబు రెడీ :
ఏపీలో చూస్తే చంద్రబాబు సైతం జిల్లా టూర్లకు సిద్ధం అవుతున్నారు అని అంటున్నారు. ఆయన ఆకస్మిక తనిఖీలు పేరుతో వివిధ జిల్లాలకు వస్తారు, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అదే విధంగా సంక్షేమ పధకాలను కూడా జనంలో నుంచే పరిశీలిస్తారు అని అంటున్నారు. అలాగే ఆయన ప్రజల మధ్యనే ఉంటూ ప్రభుత్వం పనితీరుతో పాటు అధికార పక్షంలోని ప్రజా ప్రతినిధుల పనితీరుని కూడా మధింపు చేస్తారు అని అంటున్నాఉర్. అంటే క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోవడానికి బాబు రెడీ అవుతున్నారు అన్న మాట.
లోకల్ ఫైట్ :
అంతే కాదు ఈ ఏడాది అటు తెలంగాణాలో ఇటు ఏపీలో కూడా లోకల్ బాడీ ఫైట్ ఉంది. ఇప్పటికే తెలంగాణాలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇక అక్కడ మండల జిల్లా పరిషత్తు ఎన్నికలు ఉన్నాయి. అలాగే మునిసిపాలిటీలు కార్పోరేషన్ల ఎన్నికలు ఉన్నాయి. అంటే ఒక విధంగా మినీ కురుషేత్ర సంగ్రామం అన్న మాట. ఏపీలో అయితే పంచాయతీ ఎన్నికల నుంచి మొత్తం అన్ని ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. విడతల వారీగా వీటిని నిర్వహిస్తూ 2026 జూన్ లోంగా మొత్తం ప్రక్రియను ముగించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. దాంతో అటు ఇటూ అధికార విపక్షాలకు 2024 ఎన్నికల తరువాత మరోసారి ఏపీలో మినీ ఎన్నికల సమరానికి రంగం సిద్ధం చేసేదిగా 2026 ఇయర్ ఉండబోతోంది అన్న మాట. మరి 2024లో విపక్షాలకు చేదు అనుభవాలు ఉన్నాయి. 2026 ఎవరికి ఫేవర్ చేస్తుందో చూడాల్సి ఉందని అంటున్నారు.