హెల్త్‌ బులెటిన్‌ విడుదల.. ఒక్కరోజులో 472 కేసులు

Update: 2020-04-05 15:03 GMT
కరోనా వైరస్‌పై తాజా వివరాలు రోజూ కేంద్ర హోం శాఖ వెల్లడిస్తోంది. రోజులో ఎన్ని కేసులు నమోదయ్యాయో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటిస్తోంది. ఆ క్రమంలో తాజాగా ఆదివారం దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల వివరాలు వెల్లడించారు. ఒక్కరోజే 472 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయని, ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 3,374 చేరాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లోనే ఏకంగా 472 కేసులు నమోదవగా 11 మంది మరణించారని ప్రకటించారు. దేశంలోని 274 జిల్లాల్లో మహమ్మారి ప్రభావం నెలకొందని - వైరస్‌ నుంచి కోలుకుని ఇప్పటివరకూ 267 మంది డిశ్చార్జయ్యారని వెల్లడించారు.

అయితే దేశంలో తబ్లిగీ జమాత్‌ ద్వారా కేసులు విపరీతంగా పెరిగాయని కేంద్ర హోంశాఖ తెలిపింది. వైరస్‌ కేసులు రెట్టింపయ్యే వ్యవధి మరో 4 రోజుల పాటు ఉంటుందని తెలిపారు. మొత్తం కేసుల్లో 30 శాతం ఢిల్లీలో జరిగిన మర్కజ్‌ లో పాల్గొన్న తబ్లిగీ సభ్యుల కారణంగా వ్యాపించినవేనని కరోనా వైరస్‌ వ్యాప్తికి గల కారణాలు వెల్లడించారు. కరోనా వైరస్‌ రోగుల కోసం దేశవ్యాప్తంగా 27,661 షెల్టర్‌ క్యాంపులు ఏర్పాటవుతున్నాయని వివరించారు.

ఈ వైరస్‌ సోకిన వారికి దేశవ్యాప్తంగా సత్వర వైద్యం అందిస్తున్నారు. కరోనా వైరస్‌ కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. లాక్‌ డౌన్‌ పకడ్బందీగా అమలవుతోంది.


Tags:    

Similar News