నలుగురు పిల్లలను కనాలి...లేకపోతే !

తాను మొత్తం హిందూ సమాజానికే విజ్ఞప్తి చేస్తున్నాను అని నవనీత్ రాణా అన్నారు. ఒక వర్గం పెద్ద సంఖ్యలో పిల్లలను కనడం ద్వారా హిందూస్థాన్ ని పాకిస్తాన్ గా మార్చాలని చూస్తోంది అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.;

Update: 2025-12-24 23:30 GMT

దేశంలో ఎప్పుడూ జరిగే చర్చ ఏమిటి అంటే హిందూత్వం మీదనే. అంతే కాదు పొరుగు దేశాల నుంచి ప్రమాదం ఉందని కూడా ఈ చర్చ సాగుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే కొత్తగా మరో చర్చ కూడా సాగుతోంది దేశంలో హిందువుల జనాభా తగ్గుతోంది అన్నదే ఆ చర్చ. రాను రానూ రేషియో చూస్తే హిందువుల సంఖ్య తగ్గుతోందని అది ప్రమాదకరమని అంటున్నారు. ఆర్ఎస్ఎస్ అయితే ఈ విషయంలో జనాలను హెచ్చరిస్తూ వస్తోంది. బీజేపీ నాయకులు కూడా ఇదే విషయం మీద పదే పదే చెబుతూ ఉంటారు. ఇక బీజేపీకి చెందిన మాజీ ఎంపీ కీలక మహిళా నేత నవనీత్ రాణా తాజాగా దీని మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ హిందువులు అధిక సంఖ్యలో పిల్లలను కనాలని పిలుపు ఇచ్చారు.

దేశ జనాభా కూర్పు :

భారత దేశంలో ఈ రోజు హిందువులు అధికంగా ఉన్నారని, కానీ ఎప్పటికీ ఆ పరిస్థితి ఉండకపోవచ్చు అని అందుకే హిందూస్తాన్ పాకిస్థాన్ గా మారకుండా ఉండాలంటే హిందువుల జనాభా గణనీయంగా పెరగాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పుకొచ్చారు. కొంత మందికి అనేక మంది పిల్లలు ఉన్నారని బహు భార్యత్వం కూడా ఉందని అందుకే వారి జనాభా పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి దేశంలో హిందువులు అధికంగా ఉండాలీ అంటే ప్రతీ హిందువూ ముగ్గురు నలుగురు పిల్లలను కనాలని ఆమె కోరారు.

ఇదే వినతి అంటూ :

తాను మొత్తం హిందూ సమాజానికే విజ్ఞప్తి చేస్తున్నాను అని నవనీత్ రాణా అన్నారు. ఒక వర్గం పెద్ద సంఖ్యలో పిల్లలను కనడం ద్వారా హిందూస్థాన్ ని పాకిస్తాన్ గా మార్చాలని చూస్తోంది అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్లాన్ గా అదంతా జరుగుతోందని ఆమె చెప్పుకొచ్చారు. అయితే అలాంటి ముప్పు నుంచి హిందువులు తమను తాము కాపాడుకోవాలని ఆమె సూచిస్తున్నారు. హిందువులు ఒకే ఒక్క బిడ్డతో ఎందుకు ఆగాలని ఆమె ప్రశ్నించారు. ముగ్గురు నలుగురు కనాలని ఆమె కోరారు. అలా చేస్తేనే భారత్ లో హిందూ పాపులేషన్ అధికంగా ఉండి దేశం హిందుస్థాన్ గా ఉంటుందని అన్నారు.

పిచ్చి ఆలోచనలు అంటూ :

అయితే దీని మీద కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మాట్లాడుతూ ఇవన్నీ బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ పిచ్చి ఆలోచనలు అని అన్నారు. వీటిని వారు మానుకోవాలని కోరారు. ఈ తరహా వ్యాఖ్యలను ఇకనైనా ముగింపు పలకాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే గతంలో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా దేశంలో జనాభా క్షీణతను తగ్గిస్తూ భారతీయులు కనీసంగా ముగ్గురు నలుగురు పిల్లలు కనాలని కోరారు. అంతే కాదు హిందువులు ఐక్యంగా ఉండాలని ఆయన పదే పదే పిలుపు ఇస్తున్నారు. మరి నిజంగా అలా జరుగుతుందా దేశంలో జనాభా రేషియో లో తేడా వస్తే అది ఇబ్బందులు కలిగిస్తుందా అన్నది అయితే చర్చగా ఉంది. అయితే దానికి జవాబు రాజకీయంగా సామాజికంగా వేరుగా వస్తుంది. హిందూత్వ సంస్థలు నుంచి వచ్చే జవాబు మాత్రం వేరేగా ఉంటుందని అంటున్నారు.

Tags:    

Similar News