తవ్వే కొద్దీ తగులుతున్న ఎప్ స్టీన్ షాకులు.. తెరపైకి ద్వీపంలో యాసిడ్!

ఈ క్రమంలో తాజాగా ఎప్ స్టీన్ ప్రైవేట్ కరేబియన్ ద్వీపానికి వందల గ్వాలన్ల యాసిడ్ సరఫరా అయ్యిందనే విషయం వెలుగులోకి వచ్చింది.. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది!;

Update: 2026-02-11 15:30 GMT

తొలుత అమెరికాలోనూ, తర్వాత ప్రపంచ వ్యాప్తంగాను పెను ప్రకంపనలు సృష్టిస్తోన్న ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించి ఇటీవల యూఎస్ న్యాయ శాఖ విడుదల చేసిన లక్షలాది ఫైల్స్ లో తవ్వే కొద్దీ సంచలనాలు బయటపడుతున్నాయి.. ప్రపంచానికి షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి! ఈ క్రమంలో తాజాగా ఎప్ స్టీన్ ప్రైవేట్ కరేబియన్ ద్వీపానికి వందల గ్వాలన్ల యాసిడ్ సరఫరా అయ్యిందనే విషయం వెలుగులోకి వచ్చింది.. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది!

అవును.. హాలీవుడ్ సినిమాల్లోని అండర్ వరల్డ్ డాన్ సినిమాలకు మించిన షాకింగ్ విషయాలతో అన్నట్లుగా దూసుకుపోతున్న ఎప్ స్టీన్ ఫైల్స్ వ్యవహారంలో తాజాగా సైకో సినిమాల్లోని సన్నివేశాల తరహా ఘటనలూ జరిగాయా అనే సంచలన సందేహాలు తెరపైకి వస్తున్నాయి. అందుకు కారణమైంది తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం. అందేమిటంటే... 330 గ్వాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ ను ఎప్ స్టీన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.. పైగా అదీ అతనిపై దర్యాప్తు మొదలుపెట్టిన రోజే!

వివరాళ్లోకి వెళ్తే... ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కేసుపై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్.బీ.ఐ)... 2018లో దర్యాప్తు మొదలుపెట్టిన జూన్ 12వ తేదీన అతని లిటిల్ సెయింట్ జేమ్స్ ద్వీపంలో 55 గ్యాలన్ల ఆరు భారీ డ్రమ్ములలో మొత్తం 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ ను డెలివరీ చేసినట్లు చెబుతున్నారు. దీంతో ఈ విషయం సంచలనంగా మారగా.. దీన్ని ఎందుకు ఉపయోగించి ఉండొచ్చు అనే ఊహాగాణాల మధ్య తెరపైకి వస్తోన్న విషయం షాకింగ్ గా మారింది.

ఈ సందర్భంగా ఎప్ స్టీన్ ఇంత భారీ సైజులో సల్ఫూర్యిక్ యాసిడ్ ను కొనుగోలు చేయడానికి రెండు కారణాలు ఉండొచ్చని అంటున్నారు. అందులో ఒకటి అత్యంత భయంకరమైనది కాగా.. మరొకటి అత్యంత సహజమైన విషయం కావడం గమనార్హం! ఇందులో భాగంగా... ఈ యాసిడ్ తో తన ద్వీపంలోని సాక్ష్యాలను, మానవ అవశేషాలను నాశనం చేసి ఉండొచ్చనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. దీనితో అస్తిపంజరాలు సైతం దొరక్కుండా చేసి ఉండటం కోసం అయ్యి ఉండొచ్చా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి!

మరోవైపు ద్వీపంలో రివర్స్ అస్మాసిస్ (ఆర్.ఓ) నీటి శుద్ధీకరణ వ్యవస్థను నిర్వహించడానికి ఈ యాసిడ్ ఉపయోగించి ఉండొచ్చని చెబుతున్నారు. ఆర్.ఓ. వ్యవస్థలు సాధారణంగా పీ.హెచ్. స్థాయిలను నియంత్రించడానికి, నీటిని తేటగా చేయడానికి, వడపోత సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ యాసిడ్ పై ఆధారపడతాయని చెబుతున్నారు. అయితే.. ఇందులో దేనికోసం ఆ యాసిడ్ వాడారనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది!

Tags:    

Similar News