పగిలిన హృదయాలకు ఏఐతో ప్యాచప్.. సులేమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అవును... భావోద్వేగ మద్దతు కోసం వినియోగదారులు చాలా మంది ఏఐపై ఆధరాపడుతున్నారనే సంగతి తెలిసిందే.;
ఈ ప్రపంచ సాంకేతిక రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ తర్వాత మనిషి ఆలోచనా విధానం చాలా వరకూ మారిపోయిందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ గ్రహంపై మనిషికి తోడుగా మరో మనిషే ఉండాలనే నియమాన్ని ఇది క్రమక్రమంగా చెరిపేస్తుందని చెబుతున్నారు. పైగా ఏఐ చాట్ బాట్ తో సృష్టించుకున్న పాత్రలను వివాహం చేసుకునే వరకూ పరిస్థితి వెళ్లిపోయింది. ఈ సమయంలో ఓ ఆసక్తికర స్టేట్ మెంట్ తెరపైకి వచ్చింది.
అవును... భావోద్వేగ మద్దతు కోసం వినియోగదారులు చాలా మంది ఏఐపై ఆధరాపడుతున్నారనే సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా.. కొంతమంది వినియోగదారులు చాట్ జీపీటీ తమ చికిత్సకుడిగా ఉపయోగిస్తున్నారంటూ ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్ మన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మైక్రోసాఫ్ట్ ఏఐ సీఈఓ ముస్తఫా సులేమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... భావోద్వేగ మద్దతులో ఏఐ పాత్రను హైలెట్ చేశారు.
ఇందులో భాగంగా... భావోద్వేగ మద్దతు కోసం ఏఐపై ఆధారపడుతున్నట్లు కనిపించే వినియోగదారులు చాలా మంది ఉన్నారని అన్నారు. తాజాగా బ్రేక్ డౌన్ పాడ్ కాస్ట్ లో మాట్లాడిన సులేమాన్... ఏఐ సహచరులను భావోద్వేగ మద్దతు కోస ఎక్కువగా ఉపయోగిస్తున్నారని.. ముఖ్యంగా విడిపోవడం, కుటుంబ విభేదాలు వంటి వ్యక్తిగత సవాల్ల సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమయంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... ఏఐ సహచరుల మీద ఆధారపడటం ఏమీ చికిత్స కాదని.. ఇవి ఎలాంటి పరిష్కారాలు సూచంచవని.. కాకపోతే సానుభూతి, గౌరవంతో వ్యవహరిస్తాయని.. ఆ దిశగా అవి శిక్షణ పొందుతాయని.. ఇక్కడ మన బాధను తగ్గించుకోవడం ద్వారా కాస్త ఉపశమనం పొంది, తదుపరి ప్రయాణాన్ని మెరుగ్గా కొనసాగించగలమని ముస్తఫా సులేమాన్ అన్నారు.
ఇదే సమయంలో.. చాట్ బాట్ లు వ్యక్తులు తమను తాము స్వేచ్ఛగా వ్యక్తీకరించుకోవడానికి.. సిగ్గు, మొహమాటం వంటి సమస్యలు లేకుండా ప్రశ్నలు అడగడానికి అనుమతిస్తాయని తెలిపారు.
కాగా... చాట్ బాట్స్ తో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ప్రధానంగా కొంతమంది తమ రహస్యాలను గతంలో చేసిన తప్పులను చాట్ బాట్ తో చర్చిస్తుంటారనేది తెలిసిన విషయమే! ఈ సమయంలో వారి పూర్తి వ్యక్తిగత వివరాలను, సమాచారన్ని చాట్ బాట్ తో పంచుకుంటుంటారు. అయితే ఇలాంటి సున్నితమైన సమాచారం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
ఇక... ఇటీవల జపాన్ కు చెందిన కానో అనే 32 ఏళ్ల మహిళ, మూడేళ్ల నిశ్చితార్థం విఫలం అనంతరం చాట్ జీపీటీతో సంభాషించడం ప్రారంభించి.. రాను రానూ అది ఆత్మీయ సంభాషణగా మారిపోవడంతో.. క్లాస్ అనే ఆ పాత్రను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. జపాన్ లోని యానిమే, వర్చువల్ పాత్రలతో వివాహాలను నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన ఒక సంస్థ 'కానో, క్లాస్' అధికారికంగా ఒకటి కావడంలో సహకరించింది!