తంపుల‌మారి ట్రంప్ తో వాన్స్ తెగ‌దెంపులు? నిజ‌మెంత‌?

మ‌ళ్లీ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం వేళ వీరిద్ద‌రి వైఖ‌రి ఏమిట‌న్న‌ది చ‌ర్చ‌నీయంగా మారింది. దీనిపై వాన్స్ స్పందించారు.;

Update: 2026-03-17 12:30 GMT

పెహ‌ల్గాం ఉగ్ర‌దాడికి ప్ర‌తీకారంగా పాకిస్థాన్ కు బుద్ధిచెబుతూ భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సిందూర్ స‌మ‌యంలో అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ భిన్న ప్ర‌క‌ట‌న‌లు చేశారు. దీంతోనే వీరిద్ద‌రి మ‌ధ్య సమ‌న్వ‌యం లేద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. భార‌త్-పాక్ మ‌ధ్య ఉద్రిక‌త్త‌లు ముగిసేందుకు తాను మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేస్తాన‌న్న‌ ట్రంప్.. ఆ త‌ర్వాత కాల్పుల విర‌మ‌ణకు తానే కార‌ణ‌మ‌ని అన్నారు. భారీగా సుంకాలు విధిస్తాన‌ని హెచ్చ‌రించ‌డం వ‌ల్లే భార‌త్-పాక్ వెన‌క్కుత‌గ్గాయ‌ని చెప్పుకొచ్చారు. అయితే, వాన్స్ మాత్రం మ‌ధ్య‌వ‌ర్తిత్వం అమెరికాకు సంబంధం లేని విష‌యంగా స్ప‌ష్టం చేశారు. భార‌త్ పై పాక్ దాడి చేసిన‌ప్పుడు ఆయుధాల‌ను కింద ప‌డేయ‌మ‌ని చెప్ప‌లేమ‌న్నారు. ఉద్రిక్త‌త‌లు మంచివి కాద‌ని, దౌత్య మార్గాలను ప్రోత్స‌హిస్తామ‌ని పేర్కొన్నారు. మొత్తానికి ట్రంప్ ఒక ర‌క్ష‌కుడిగా ఉండాల‌ని భావిస్తే, వాన్స్ మాత్రం అమెరికా ప్ర‌యోజ‌నాలే ముఖ్యం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించారు. మ‌ళ్లీ ఇప్పుడు ఇరాన్ తో యుద్ధం వేళ వీరిద్ద‌రి వైఖ‌రి ఏమిట‌న్న‌ది చ‌ర్చ‌నీయంగా మారింది. దీనిపై వాన్స్ స్పందించారు.

మా ఇద్ద‌రిని విడ‌దీయాల‌ని చూస్తున్నారు..

ట్రంప్ అంటే తంపులమారి (గొడ‌వ‌లకు దిగే ర‌కం). వాన్స్ తీరు మాత్రం అది కాద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే త‌మ మ‌ధ్య విభేదాలు పుట్టించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతోంద‌ని వాన్స్ అన్నారు. విదేశాంగ విధానంలో అంద‌రూ అధ్య‌క్షుడికి స‌హ‌క‌రిస్తున్నార‌ని చెప్పారు. అంటే, యుద్ధాల విష‌యంలో త‌మ పాత్ర కూడా ఉంద‌ని ప‌రోక్షంగా చెప్పారు. ఆయ‌న ప‌ని పూర్తి చేస్తార‌నే (ఇరాన్ యుద్ధం) విశ్వాసాన్ని వ్య‌క్తం చేశారు. ఇదే స‌మ‌యంలో గ‌తంలో ప‌శ్చిమాసియా వ్య‌వ‌హారాల‌పై వాన్స్ చేసిన వ్యాఖ్య‌ల‌ను మీడియా గుర్తుచేయగా, ఆయ‌న స్పందించ‌లేదు. అయితే, ఇదంతా ట్రంప్ స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం

ప‌దేళ్లుగా ప్ర‌య‌త్నిస్తున్నారు...

ట్రంప్, త‌న‌కు మ‌ధ్య విభేదాలు ఏర్ప‌డేలా 2015 నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారంటూ మీడియాను నిందించారు వాన్స్. కానీ, ఆయ‌న‌తో తాను ఏకీభ‌విస్తున్న‌ట్లు తెలిపారు. ఇరాన్ వ‌ద్ద అణ్వాయుధాలు ఉండేందుకు వీల్లేదు అంటూ.. ట్రంప్ చేస్తున్న యుద్ధాన్ని స‌మ‌ర్థించారు. గ‌తంలోని అధ్య‌క్షుల త‌ర‌హాలో కాకుండా ట్రంప్ ప‌ని పూర్తి (ఇరాన్ పై యుద్ధం) అన్నారు. కాగా, గ‌తంలో ఇరాన్ తో యుద్ధాన్ని వాన్స్ వ్య‌తిరేకించిన‌ట్లు క‌థ‌నాలు వ‌చ్చాయి. ఇది అమెరికాకు ఉప‌యోగం లేని ప‌ని అని, వ‌న‌రులు వేస్ట్ అని కూడా అభిప్రాయం వ్య‌క్తం చేసిన‌ట్లు విశ్లేష‌ణ‌లు వెలువ‌డ్డాయి. ఇప్పుడు మాత్రం వాన్స్.. పూర్తిగా భిన్నాభిప్రాయం వ్య‌క్తం చేశారు. అయితే, ఆయ‌న ఉపాధ్య‌క్షుడిగా ఎంత చెప్పినా.. అధ్య‌క్షుడిగా ట్రంప్ నిర్ణ‌య‌మే ఫైన‌ల్ కాబ‌ట్టి పైకి దాన్ని స‌మ‌ర్థిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Tags:    

Similar News