వర్చ్యువల్ గా కేబినేట్ మీట్...ఆర్నాబ్ పై చర్చ

దీంతో మంత్రులకు వెసులుబాటు కల్పించేందుకు వారు ఉన్న జిల్లాల నుంచే నేరుగా పాల్గొనేలా వర్చ్యువల్ గా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అని అంటున్నారు.

Update: 2026-10-28 17:58 GMT

ఏపీ మంత్రివర్గ సమావేశం ఈ నెల 29న గురువారం నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశం వర్చ్యువల్ గా జరుగుతుందని అంటున్నారు. అర్జంట్ గా ఈ కేబినెట్ భేటీ జరగనుండడం ఒక కారణం అయితే ఏపీని అతలాకుతలం చేసిన ఆర్నాబ్ తుఫాన్ గురించి చర్చించేందుకే ఈ భేటీ అని అంటున్నారు. ఇక తుఫాను సహాయక చర్యలలో మంత్రులు అంతా నిమగ్నం అయి వారి జిల్లాలలో ఉన్నారు. దాంతో కేబినెట్ భేటీకి ఫిజికల్ గా అటెండ్ అయ్యే వారు ఎంత మంది అన్నది కూడా ఉంది. దీంతో మంత్రులకు వెసులుబాటు కల్పించేందుకు వారు ఉన్న జిల్లాల నుంచే నేరుగా పాల్గొనేలా వర్చ్యువల్ గా సమావేశాన్ని ఏర్పాటు చేశారు అని అంటున్నారు.

కీలక అంశాలతో పాటు :

గురువారం ఉదయం పదిన్నర గంటలకు జరిగే ఈ కేబినెట్ బేటీలో కీలకమైన అంశాలతో పాటు ఆర్నాబ్ తుఫాన్ పై ప్రత్యేక చర్చ ఉంటుందని తెలుస్తోంది. ఏపీ మొత్తాన్ని ఆర్నాబ్ దెబ్బ తీసింది. భారీ నష్టాన్ని కష్టాన్ని మిగిల్చింది. ప్రాథమిక అంచనాలు చూస్తే వేల కోట్లలో నష్టం వాటిల్లింది అని అంటున్నారు. రాష్ట్రానికి ఇది కోలుకోలేని దెబ్బగా చెబుతున్నారు. దాంతో ఏపీపై విరుచుకుపడిన ఆర్నాబ్ తుఫాన్ గురించి సీరియస్ గానే చర్చిస్తారు అని అంటున్నారు. ఏ ఏ రంగాలలో ఎంతంత నష్టం వాటిల్లింది అన్నది చూసి కేంద్రానికి సత్వరమే నివేదిక పంపించడం ద్వారా ప్రాధమికంగా నిధులను తీసుకుని రావాలన్నది ఉద్దేశంగా కనిపిస్తోంది అంటున్నారు.

అమిత్ షా దృష్టికి :

ఇదిలా ఉంటే చంద్రబాబు ఏపీలో ఆర్నాబ్ తుఫాన్ చేసిన అపార నష్టం గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకుని వచ్చారు. రాష్ట్రంపై అర్నబ్ తుఫాన్ చేసిన భీభత్సంపై అమిత్ షాతో ఫోన్‌లోనే బాబు మాట్లాడి మొత్తం వివరించారు. తుఫాను కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమికంగా 70 వేల పైచిలుకు హెక్టార్లలో పంట నీటమునిగినట్టుగా తెలిపారు. అలాగే పది వేల 500 హెక్టార్లలో ఉద్యాన పంటలతో పాటు ఇళ్లు రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని బాబు తెలియజేశారు. ప్రాథమికంగా నష్టం అంచనాలను కేంద్రానికి పంపుతున్నామని కేంద్ర బృందాలను కూడా రాష్ట్రానికి పంపాలని చంద్రబాబు అమిత్ షాని కోరారు. అంతే కాదు,కేంద్రం నుంచి భారీగా సాయం అందేలా చూడాలని వినతి చేశారు. మరో వైపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కి అచ్చెన్నాయుడు కూడా ఏపీలో జరిగిన నష్టం గురించి లేఖ రూపంలో వివరించారు. ఏపీకి భారీగా సాయం చేయాలని ఆయన కోరారు.

స్థానిక ఎన్నికల మీద :

ఇక చూస్తే ఏపీలో కేబినెట్ ఎజెండా తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ప్రత్యేకంగా చర్చించనున్నరని తెలుస్తోంది. స్థానిక ఎన్నికల విషయంలో వాయిదాలు పడిన తీరుని అలాగే ఇక మీదట సాఫీగా వాటిని జరిగే విధంగా చూడడం మీద కూడా కేబినెట్ భేటీలో చర్చిస్తుందని అంటున్నారు. మొత్తానికి వర్చువల్ గా జరిగే ఈ మీటింగ్ లో కీలక చర్చ సాగుతుందని అంటున్నారు.

Tags:    

Similar News