స్థానిక ఎన్నికలకు అసలైన ప్రత్యర్ధిగా ?

ఆర్నాబ్ తుఫాన్ వచ్చినా నవంబర్ 1న పోలింగ్ మరోసారి వాయిదా పడకుండా యధాతధంగా నిర్వహించాలని ఎన్నికలు జరిపించాలని ఎస్ ఈసీ నిర్ణయించింది.

Update: 2026-10-28 17:11 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం సరిగ్గా కుదరలేదా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే సెప్టెంబర్ లోనే ఈ ఎన్నికలు జరిపించాలని మొదట అనుకున్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల మీద కోర్టు తీర్పుల కోసం ఆగారు. అలా లేట్ అయింది. ఇక అక్టోబర్ లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక తొలి విడత మలివిడత షెడ్యూల్స్ మొత్తం రిలీజ్ చేశాక వాయిదాల పర్వం మొదలైంది. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్ళి నామినేషన్లు తమను వేయనీయడం లేదని ఫిర్యాదు చేసింది. దాంతో సుప్రీం కోర్టు ఈ అంశం మీద ఏపీ ఎన్నికల సంఘాన్ని ఆదేశించడంతో మొదటిసారి వాయిదా పడింది. అలా అర్బన్ బాడీస్ కి జరిగే ఎన్నికల షెడ్యూల్ కాస్తా ఈ నెల 28 నుంచి నవంబర్ 1కి మారింది. కౌంటింగ్ డేట్ కూడా నవంబర్ 3కి వెళ్ళింది.

మరో విడత వాయిదా :

ఇపుడు చూస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీల పోలింగ్ కౌంటింగ్ డేట్స్ మారిపోయాయి. 3న జరగాల్సిన పోలింగ్ 5కి అలాగే 5న జరగాల్సిన కౌంటింగ్ 7కి వాయిదా పడ్డాయి. అయితే ఇపుడు ఏపీని తుఫానులు అల్ప పీడనాలు పట్టి పీడిస్తున్నాయి. ఆర్నాబ్ తుఫాన్ వల్ల నిజానికి మరోసారి అర్బన్ బాడీస్ కి ఎన్నికలు వాయిదా పడతాయని అంతా అనుకున్నారు. దాని ప్రభావం రెండు మూడు రోజులలోనే ఉండడంతో పాటు ఇప్పటికే తీరం దాటడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇపుడు మరో అల్ప పీడనం ప్రమాదం ఉందని అంటున్నారు.

పొంచి ఉన్న ముప్పు :

బంగాళాఖాతంలో ఈ నెల 31న మరో అల్ప పీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ అంచనాలు వేసింది. దంతో పాటు ఈ అల్పపీడనం ప్రభావం ఏకంగా నవంబర్ 5 దాకా ఉంటుందని చెబుతున్నారు. అంటే మొదటి విడతగా నవంబర్ 1న జరిగే అర్బన్ బాడీస్ కి అలాగే రెండవ విడతగా జరిగే ఎంపీటీసీలు జెడ్పీటీసీ పోలింగ్ అయిన నవంబర్ 5న కూడా దీని ప్రభావం ఉండొచ్చు అన్నది అంతా అంటున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీగానే వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. అదే కనుక జరిగితే ఎన్నికల ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతుందని అంటున్నారు. అంతే కాదు ఓటర్లు పోలింగ్ బూత్ లకు ఎలా వస్తారు ఓటెలా వేస్తారు అన్న చర్చ ఉండనే ఉంది.

ఎందుకిలా :

ఇప్పటికే రెండు విడతలూ చెరోసారీ వాయిదా పడ్డాయి. ఆర్నాబ్ తుఫాన్ వచ్చినా నవంబర్ 1న పోలింగ్ మరోసారి వాయిదా పడకుండా యధాతధంగా నిర్వహించాలని ఎన్నికలు జరిపించాలని ఎస్ ఈసీ నిర్ణయించింది. అయితే మళ్లీ ఏపీలో భారీ వర్షాలు కురిసి పరిస్థితులు వేరేగా మారితే తప్పని పరిస్థితులో ఎన్నికలు వాయిదా పడతాయా అన్నది కూడా చర్చగా ఉంది. నిజానికి అక్టోబర్ నవంబర్ నెలలు తుఫాన్ల సీజన్లు అన్నది తెలిసిందే. ప్రతీ ఏటా ఈ సీజన్ లో వచ్చే భారీ తుఫాన్ తో కోస్తాంధ్రా అల్లల్లాడుతుంది. ఈసారి ఎల్ నినో వల్ల వానలు లేవు కాబట్టి తుఫాన్లు కూడా పెద్దగా ఉండకపోవచ్చు అని అంతా అనుకున్నారు. కానీ జరుగుతున్నది వేరుగా ఉంది అని అంటున్నారు. మొత్తానికి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సరైన ముహూర్తం కుదరలేదా అన్నది అయితే చర్చగా ఉంది మరి.

Tags:    

Similar News