• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఫార్టీ ఇయర్స్...

ఫార్టీ ఇయర్స్ టీడీపీ..హిస్టరీ రిపీట్...?

By - Tupaki Desk
Update: 2022-03-25 23:30 GMT
తెలుగుదేశం పార్టీ వయసు నాలుగు దశాబ్దాలు.  1982 మార్చి 29న సాయంత్రం కేవలం నలభై మందితో ఒక చిన్న స్థాయి మీటింగ్ హైదరాబాద్ లో నాటి ప్రఖ్యాత తెలుగు సినిమా  నటుడు ఎన్టీయార్ ఏర్పాటు చేశారు. ఆ వార్త  ఆ రోజు ఆరు గంటల ఆకాశవాణి వార్తలలో చిన్నగా ప్రసారం అయింది. అంతే ఒక్కసారిగా దేశంలోనే దావానలంగా మారిపోయింది.

తెలుగుదేశం పార్టీ అలా పుట్టిన పార్టీ. ఎన్టీయార్ వెండి తెర వేలుపు కాస్తా జనాలకు సరికొత్త నాయకుడిగా అవతరించారు. టీడీపీ నాలుగు దశాబ్దాల రాజకీయమంతా ఒక చరిత్రగా చూడాలి. ముఖ్యంగా మొదటి పద్నాలుగేళ్లూ ఎన్టీయార్ టీడీపీకి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు.

ఎన్టీయార్ శకం టీడీపీలో ఒక అద్భుతం. ఆయన మాట, బాట అంతా కూడా ఒక  రికార్డే . సరికొత్త ప్రభంజనమే. టీడీపీకి ఎన్టీయార్ ఒక బలం. ఆయన కొండంత అండ. ఇక ఎంన్టయార్ అనంతరం చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ గత ఇరవై ఆరు ఏళ్ళుగా సాగుతోంది. చంద్రబాబు అందులో పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు.

ఎన్టీయార్ గ్లామర్ తో పార్టీని నడిపిస్తే చంద్రబాబు పొలిటికల్ గ్రామర్ తో ఇంతదాకా టీడీపీ ప్రస్థానాన్ని తీసుకువచ్చారు. ఎన్టీయార్ అభిమానులంతా టీడీపీలోనే ఉండేలా చూసుకున్నారు. పార్టీని ఇంకా పటిష్ఠం చేశారు. మొత్తానికి ఎన్టీయార్ ఒకసారి ఓడితే చంద్రబాబు మూడు సార్లు ఓడారు.

అయితే ఇపుడు టీడీపీకి కీలక సమయం. 2019 ఎన్నికల్లో ఓడిన పార్టీకి 2024  ఎన్నికలు ముఖ్యం. దానికి రెండేళ్ళ ముందే నలభయ్యవ మైలు రాయిని టీడీపీ దాటుతోంది. ఈ రాజకీయ మూలధనాన్ని,  ఇంధనాన్ని ఉపయోగించుకుని రెట్టించిన ఉత్సాహంతో 2024 ఎన్నికలలో విజయఢంకా మోగించాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది.

అందుకే నలభయ్యేళ్ల టీడీపీ ఉత్సవాలని ఘనంతా నిర్వహించాలని చూస్తోంది. దానికి సంబంధించిన  లోగోను టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీయార్ ఒక చరిత్ర. టీడీపీదీ అదే చరిత్ర. ఆయన పేదల కోసం పార్టీని పెట్టారు, బీసీలు టీడీపీని వెన్నుదన్ను అని పేర్కొన్నారు.

పార్టీ కోసం క్యాడర్ అంతా పునరంకితం అయ్యేలా నలభయ్యేళ్ళ వేడుకలను ఘనంగా ఊరూ వాడా నిర్వహించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. మొత్తానికి సరైన సమయానికి టీడీపీ హిస్టారికల్ ఈవెంట్ వచ్చింది. దాంతో 1983 నాటి హిస్టరీని రిపీట్ చేయాలని ఆ పార్టీ ఆశిస్తోంది ఆ దిశగా పయనిస్తోంది.
Tags:    
  • NTR 
  • Telugudesam Party 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

Copyright @2026

Powered by Blink CMS