• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ట్రంప్ బాటలో బైడెన్ .....

ట్రంప్ బాటలో బైడెన్ .. మరో 28 చైనా కంపెనీలను బ్లాక్‌ లిస్ట్‌ లో..!

By - Tupaki Desk
Update: 2021-06-05 11:30 GMT
చైనా పై అగ్రరాజ్యం అమెరికా కయ్యానికి  ఇంకా కత్తి దుసుతోంది. గత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ బాటలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ కూడా చైనా సంస్థలపై కక్షగట్టారు. ఇందులో భాగంగా చైనాకు సంబంధించిన మరికొన్ని సంస్థలను బ్లాక్‌ లిస్ట్‌ లోకి తరలించారు. ముఖ్యంగా బీజింగ్‌ లోని సైనిక సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న తమ దేశంలోని అమెరికా పెట్టుబడిదారులపై పరిమితులు విధించింది. 31 చైనా కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేయకుండా గత అధ్యక్షుడు ట్రంప్‌ అడ్డుకుంటే, ఇప్పుడు మరో 28 కంపెనీలపై ఆంక్షలను విధించిన బైడెన్‌ ఆ సంఖ్యను 59కి పెంచారు.

అమెరికాను భద్రత లేదా ప్రజాస్వామ్య విలువలను అణగదొక్కే, తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనను సులభతరం చేసేందుకు వినియోగించే చైనా నిఘా సాంకేతిక పరిజ్ఞానంలో భాగస్వాములైన కంపెనీలపై ఈ ఆంక్షలు విధించినట్లు వైట్‌ హౌస్‌ ప్రకటించింది. తొలి జాబితాలో చైనా మొబైల్‌, చైనా టెలికాం, వీడియో నిఘా సంస్థలు హిక్‌ విజన్‌, చైనా రైల్వేవ కన్‌స్ట్రక్షన్‌ కార్ఫ్‌ వంటి ప్రధాన టెలికాం సంస్థలు, కన్‌ స్ట్రక్షన్‌, టెక్నాలజీ సంస్థలపై ట్రంప్‌ సర్కార్‌ బ్లాక్‌ లిస్ట్‌ లో పెట్టింది. ఆయా కంపెనీలకు చైనా సైన్యం, నిఘా సంస్థలతో బలమైన సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తోంది. అందుకే తమ దేశంలో పెట్టుబడులు పెట్టే కొన్ని చైనా కంపెనీలపై ఇప్పటికే ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో తాజాగా మరికొన్ని కంపెనీలను చేర్చింది. అమెరికా ప్రభుత్వం ఆ ఉత్తర్వును వెంటనే వెనక్కి తీసుకోవాలని చైనా కోరింది. అమెరికాలో చైనా కంపెనీలకు సానుకూల పెట్టుబడి, వ్యాపార వాతావరణాన్ని కల్పించాలని తెలిపింది. తమ సంస్థలు, కంపెనీలపై ఎలాంటి వివక్ష చూపొద్దని కోరింది. చైనా కంపెనీల హక్కుల పరిరక్షిస్తామని తెలిపింది.
Tags:    
  • Joe Biden 
  • American President 
  • China 
  • Latest News 
  • Telugu News 
  • America 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS