శానిటైజర్ తాగి మృతిచెందిన వారిలో నలుగురికి కరోనా పాజిటివ్ ..!
ప్రకాశం జిల్లా కురిచేడు మండల కేంద్రంలో పెనువిషాదం చోటుచేసుకుంది. శానిటైజర్ ను సేవించిన 12 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో ఇద్దరు గురువారం రాత్రి..మిగిలిన తొమ్మిది మంది శుక్రవారం మరణించారు. మృతులంతా యాచకులు, రిక్షా పుల్లర్లు, కూలీలే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా పలు చర్చలకి దారితీస్తుంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచితే మద్యానికి కొద్ది కొద్దిగా దూరం అవుతారు అనుకుంటే..మద్యం ధరలు కొండెక్కి కూర్చోవడంతో శానిటైజేర్ లో మద్యం ఉంటుంది అని , అది అతి తక్కువకే వస్తుంది అని శానిటైజేర్ కొనుక్కొని తాగి ప్రాణాలు కోల్పోయే వారు ఎక్కువవుతున్నారు.
తాజాగా ప్రకాశం జిల్లాలో రెండు రోజుల్లో మొత్తం కలిపి 12మంది శానిటైజేర్ తాగి ప్రాణాలు కోల్పోయారు. మద్యం దొరక్క శానిటైజర్ తాగి వారు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలపై జిల్లా ఎస్పీ దర్యాప్తు సిద్దార్థ్ కౌశల్ ప్రారంభించారు. కాగా, ఆ మృతదేహాలకు పోస్టుమార్టం కోసం దర్శి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ మృతదేహాలకు కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా.. మృతుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. దీనితో వారి కుటుంబసభ్యులకు శనివారం కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు సన్నద్ధమవుతున్నారు.