హైదరాబాద్ ఆసుపత్రిలో కరోనాతో బామ్మ.. 100 పుట్టిన రోజు వేడక

Update: 2020-10-08 05:00 GMT
నిండు నూరేళ్లు జీవించు అన్న ఆశీర్వాదం అందరికి పలికినా.. కోట్లల్లో కొద్దిమంది మాత్రమే దాని వరకు వస్తారు. అలా వచ్చిన వారికి కరోనా సోకితే? విన్నంతనే వణుకు పుడుతుంది కదా? కానీ.. హైదరాబాద్ కు చెందిన ఒక బామ్మ తాజాగా కరోనా పాజిటివ్ కావటంతో ఆమె ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆమెకు చికిత్స చేస్తున్న వైద్యులు.. ఆమె వివరాల్ని సేకరించారు. ఈ  సందర్భంగా ఆసక్తికర సమాచారం వారి దృష్టికి వచ్చింది. అదేమంటే.. ఆమె వందో పుట్టిన రోజని.

హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతున్న బామ్మకు వందో పుట్టిన రోజును అక్కడి వైద్యులు ఘనంగా నిర్వహించారు. షుగర్.. బీపీలకు తోడుగా వచ్చిన కరోనా కారణంగా ఆమె తీవ్రమైన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు దీంతో.. ఆమె ఆసుపత్రిలో చేరారు. ఐసీయూలో ఉంచిన వైద్యులు ఆమెకు వైద్యం అందించారు. ఆమెతో పాటు.. ఆమె 65 ఏళ్ల కుమారుడికి కరోనా పాజిటివ్ అని తేలటంతో ఆయన కూడా చికిత్స పొందుతున్నారు.

ఈ సమయంలోనే బామ్మ డేట్ ఆఫ్ బర్త్ గురించి తెలుసుకున్న వైద్యులు.. వందో పడిలోకి అడుగు పెట్టిన వైనాన్ని గుర్తించి.. ఆసుపత్రిలో ఘనంగా పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు. కరోనా కారణంతో తలెత్తిన ఆరోగ్య సమస్యల్ని ఆ బామ్మ అధిగమించినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. మాయదారి మహమ్మారిని విజయవంతంగా అధిగమించిన బామ్మకు హ్యాపీ బర్త్ డే చెబుదాం.
Tags:    

Similar News