పదేళ్ల పిల్లాడు.. ఎమ్మెల్యేకే షాకిచ్చాడు
ఆ పిల్లాడి వయసు కేవలం పదేళ్లు మాత్రమే. ఆ ఊళ్లో ఉన్న పెద్దోళ్లు చేయలేని పనిని ఇట్టే చేసేశాడు. వార్తల్లోకి వచ్చాడు. తమ ఎమ్మెల్యే ఎదురైనప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యను ఎలుగెత్తిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అదే సమయంలో.. పిల్లాడి మాటల్ని లైట్ తీసుకోకుండా సదరు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించటం ఈ ఎపిసోడ్ లో మరో ఆసక్తికర అంశంగా చెప్పాలి.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సర్వారెడ్డి పల్లి గ్రామంలో భగీరథ నీటి పనులు ప్రారంభించేందుకు చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్ వచ్చారు. ఎమ్మెల్యే వచ్చినంతనే.. అందరూచుట్టు మూగటం.. అయ్యవారికి మర్యాదలు చేయటం తెలిసిందే. కానీ.. పదేళ్ల యశ్వంత్ మాత్రం.. మా కాలనీకి రోడ్డు వేయాలంటూ పెద్దగా కేకలు వేశాడు. అనూహ్య పరిణామంతో ఉలిక్కిపడ్డారు అక్కడి వారు. ఇక.. స్థానిక నేతల సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. స్థానిక సమస్యను పరిష్కరించని వేళ.. పిల్లాడు ప్రశ్నించటం అక్కడి వారిని ఆకట్టుకుంది.
పిల్లాడి కేకలు విని.. దగ్గరకు పిలిచిన ఎమ్మెల్యే.. సమస్యను అడిగి తెలుసుకున్నారు. తమ కాలనీకి రోడ్డు వేయాలని.. సమస్యగా ఉందని చెప్పాడు. దీంతో.. ఆ పిల్లాడి భుజం తట్టిన ఎమ్మెల్యే.. వెంటనే రోడ్డు ప్రతిపాదనలు ఇవ్వాలని.. వెంటనే పని పూర్తి చేయాలని ఆదేశించారు. పిల్లాడే అయినా.. సామాజిక అంశాలపై అవగాహన.. అంతకు మించి ప్రశ్నించే తత్త్వం పలువురిని ఆకట్టుకుంది.