ఎన్డీయేలోకి వైసీపీ ...?
పవన్ కళ్యాణ్ ఎన్డీయే విషయంలో ఊగిసలాడుతున్నారు. ఒక రోజు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాను అంటారు.;
పవన్ కళ్యాణ్ ఎన్డీయే విషయంలో ఊగిసలాడుతున్నారు. ఒక రోజు ఎన్డీయే నుంచి బయటకు వచ్చాను అంటారు. మరో రోజు లేదు బీజేపీ పెద్దలు అంటే గౌరవం అంటారు. ఇలా పవన్ క్లారిటీ లేని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఇక కేంద్రం బ్లెస్సింగ్స్ కావాలని పవన్ కోరుతున్నారు. టీడీపీ విషయం చూసినా అంతే కేంద్రంతో తమకు ఎన్నికల వేళ పని ఉంది అని భావిస్తోంది. పోల్ మేంజేమెంట్ స్కిల్స్ లో టీడీపీ దిట్ట అయినా కూడా ఎలక్షనీరింగ్ చేసుకునే విధనాంలో మాత్రం బాగా వెసులుబాటు కావాలీ అంటే కేంద్రం సపోర్ట్ ఉండాలి.
అందుకే బీజేపీకి ఏపీలోని వైసీపీ అయినా టీడీపీ అయినా అంత విలువ ఇస్తాయని చెబుతారు. ఎన్నికల్లో ఏ రకంగా దాడులు లేకుండా ఇబ్బందులు లేకుండా కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రమేయం లేకుండా అంతా సాఫీగా హ్యాపీగా సాగాలీ అంటే పొత్తులైనా ఉండాలి లేదా ఇండైరెక్ట్ గా సపోర్ట్ అయినా ఉండాలి. ఇపుడు వైసీపీ బీజేపీల మధ్య ఏదో తెలియని బంధం ఉంది అని అంతా అంటారు.
అదే టైం లో బీజేపీ ప్రాపకం కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. మధ్యలో పవన్ ఉన్నారు. బాబు ఇపుడు జైలులో ఉన్న వేళ పవన్ కలసి వచ్చి టీడీపీతో పొత్తు మీద అనౌన్స్ చేసి బీజేపీకి షాక్ ఇచ్చారు. అది జరిగిన తరువాత జగన్ ఢిల్లీ వెళ్లారు. ఈ మధ్యలోనే పవన్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాలని చూసినా కేంద్ర పెద్దల అపాయింట్మెంట్స్ కుదరలేదు అని అంటున్నారు.
దీంతో విసిగిపోయిన పవన్ ఇటీవల వారాహి సభలలో కేంద్రాన్ని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసారు. ఏపీలో జగన్ అవినీతి సంగతి కేంద్ర పెద్దలకు తెలియదా అంటూ ఆయన అవనిగడ్డ సభలో డైరెక్ట్ గానే మాట్లాడారు. ఇక పెడన సభకు రాగానే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పుకున్నారు. అదే ముదినేపల్లి సభలో మాత్రం ఎన్డీయేతో ఉంటామని మాట మార్చారు.
ఇదంతా ఆయన బీజేపీ మీద వత్తిడి పెట్టే పాలిటిక్స్ కి తెర తీశారని అంటున్నారు. అయితే బీజేపీకి మాత్రం ఏపీ అవసరాలు హాయిగానే తీరిపోతున్నాయి. ఏ మాత్రం సౌండ్ చేయకుండా వైసీపీ మంచి మిత్రుడి పాత్ర పోషిస్తోంది. బహుశా అదే అక్కసుతోనే పవన్ పెడన సభలో ఎన్డీయేతో కటీఫ్ అని మాట్లాడారు అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే కేంద్ర బీజేపీ పెద్దలు పవన్ కి ఎపుడు పెద్దగా విలువ ఇచ్చారు అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పవన్ కి కనీసం అపాయింట్మెంట్స్ కూడా ఇవ్వలేదని, ఆయన రోడ్ మ్యాప్ అడిగి విసిగిపోయినా ఇవ్వలేదు అంటున్నారు. పైగా టీడీపీకి దూరంగా ఉండాలని సందేశాన్ని వారు ఇస్తే పవన్ ఆ పార్టీతోనే జట్టు కడుతున్నారు. ఈ పరిణామాల నేపధ్యంలో జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు.
జగన్ ఫ్లైట్ ఎక్కే టైం కి ఎన్డీయేతో కటీఫ్ అని పవన్ ప్రకటించారన్నది ప్రచారంలో ఉంది. ఇక జగన్ ఢిల్లీలో ల్యాండ్ అయిన వేళకు పవన్ ముదినేపల్లి సభలో మాట్లాడుతూ బీజేపీతో కలసి ఉంటామని చెప్పడమే కాదు ఏపీలో జనసేన బీజేపీ టీడీపీ సర్కార్ ఏర్పడుతుందని చెప్పారు. చిత్రమేంటి అంటే బీజేపీ టీడీపీల పొత్తు లేదు. కానీ పవన్ తానుగా ఈ ప్రకటన చేయడమే విశేషం అంటున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఢిల్లీ టూర్ లో జగన్ బీజేపీ టీడీపీతో జత కట్టకుండా తనదైన వ్యూహాలతో కేంద్ర పెద్దలను కలుస్తారు అంటున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కచ్చితంగా వైసీపీ ఎంపీలు బీజేపీకే మద్దతు ఇస్తారు, ఈ విషయం మళ్లీ ఆయన హామీ ఇస్తారు అంటున్నారు. ఇక బీజేపీకి ఏపీలో తన ఎమ్మెల్యేలను ఎంపీలను కొందరిని గెలిపించుకోవాలని ఉందని అంటున్నారు.
మరి దాని మీద కూడా వైసీపీ నుంచి హామీ ఉంటుందా అన్న చర్చ వస్తోంది. వైసీపీ పొత్తు డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ ఉంటే బీజేపీ కొన్ని సీట్లలో విజయం సాధించే చాన్స్ ఉంది అంటున్నారు. ఆ విధంగా ఏమైనా పావులు కదుపుతారా బీజేపీకి పూర్తి భరోసా ఇస్తారా అన్న దాని మీద చర్చ సాగుతోంది. ఏది ఏమైనా బీజేపీ న్యూట్రల్ గా ఉండాలని వైసీపీ కోరుకుంటోంది. అది కనుక జరిగితే ఆ పార్టీ వ్యూహం సక్సెస్ అయినట్లే అంటున్నారు.