40 ఏళ్లుగా గర్భం మోసిన మహిళ..82 ఏళ్ల వయసులో నొప్పులు.. కట్ చేస్తే!

సాధారణంగా కొన్ని కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానీ నిజాలుగా మారుతున్న వేళ. ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో నోరెళ్ళబడుతున్నారు.;

Update: 2026-01-24 14:30 GMT

మాతృత్వం అనేది పెళ్లి అయిన ప్రతి ఒక్క మహిళ కల. ఏడు నెలలు లేదా తొమ్మిది నెలలు మోసి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. ఇక ఆ బిడ్డను అల్లారు ముద్దుగా అపురూపంగా చూసుకుంటూ జీవితం ధన్యం చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మహిళ ఏడు కాదు తొమ్మిది కాదు ఏకంగా 40 ఏళ్ల పాటు గర్భవతిగా ఉండి.. చివరికి 82 సంవత్సరాల వయసులో నొప్పులు రావడంతో హాస్పిటల్ కి వెళ్ళింది. పరీక్షించిన వైద్యులు అసలు విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. మరి 40 ఏళ్ల పాటు ఆ తల్లి తన గర్భంలో బిడ్డను మోసి.. 82 సంవత్సరాల వృద్ధాప్యంలో నొప్పులు రావడం ఏంటి? ఇది నిజంగా నిజమేనా? కనీసం ఈ విషయం ఆమెకు కూడా తెలియలేదా? అని కొంతమంది ఆశ్చర్యపోతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా కొన్ని కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానీ నిజాలుగా మారుతున్న వేళ. ప్రతి ఒక్కరు ఆశ్చర్యంతో నోరెళ్ళబడుతున్నారు. అదెలా సాధ్యమనే ఆలోచనలో పడిపోతున్నారు. అలాంటి ఒక సంఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఒక మహిళ వయసు 82 సంవత్సరాలు. ఒక్కసారిగా భరించలేని కడుపునొప్పి రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు లోపల కణితి ఉంటుందని భావించారు. కానీ స్కానింగ్ తర్వాత అసలు విషయం తెలిసి ఆశ్చర్యపోయారు.

కారణం ఆమె శరీరంలో 40 సంవత్సరాలకు పైగా ఒక కాల్సిఫైడ్ గర్భస్థ శిశువు ఉంది. అంటే 40 సంవత్సరాలుగా ఆమె గర్భవతి అన్నమాట. ఈ అరుదైన పరిస్థితిని వైద్య పరిభాషలో లిథోపెడియన్ లేదా స్టోన్ బేబీ అని పిలుస్తారు. అంటే గత 40 ఏళ్ల క్రితం ఆ మహిళకు ఎక్టోపిక్ గర్భం ఏర్పడిందట . అంటే గర్భస్థ శిశువు గర్భం లోపల కాకుండా గర్భం బయట అభివృద్ధి చెందడం.. దీని కారణంగానే ఆ మహిళకు పురిటి నొప్పులు అందరి లాగే రావడం , బిడ్డను కనడం వంటి పరిస్థితి ఎదురు కాలేదు.

పైగా ఈ సంక్రమణను నిరోధించడానికి అనుగుణంగా ఆమె శరీరం గర్భస్త శిశువును క్యాల్షియంతో ఆవరించి ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసిందట. ఫలితంగా శిశువు గర్భాశయం వెలుపలి భాగంలో ఒక మమ్మీ సైడ్ రూపంగా మారి నిశ్శబ్దంగా ఉండిపోయింది. అందుకే ఎటువంటి గర్భస్థ లక్షణాలను కూడా కనబరచలేకపోయింది. నిజానికి ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయట. వైద్య చరిత్రలో ఇప్పటివరకు కేవలం 300 కేసులు మాత్రమే గుర్తించినట్లు వైద్యులు తెలిపారు. ఇకపోతే ఈ విషయం ఎక్కడ? ఎప్పుడు? ఎవరిలో జరిగింది అనే పూర్తి వివరాలు మాత్రం లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

Tags:    

Similar News