బంగ్లాపై ఐసీసీ వేటు.. స్కాట్లాండ్ కు అనూహ్య చోటు

వ‌చ్చే నెల 7 నుంచి భార‌త్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జ‌ర‌గ‌నున్న టి20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ అయింది.;

Update: 2026-01-24 13:18 GMT

వ‌చ్చే నెల 7 నుంచి భార‌త్-శ్రీలంక సంయుక్త ఆతిథ్యంలో జ‌ర‌గ‌నున్న టి20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి బంగ్లాదేశ్ ఔట్ అయింది. దొంగ సాకులు చూపుతూ భార‌త్ లో ఆడేందుకు నిరాక‌రించిన ఆ జ‌ట్టును.. అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)... నిర్దాక్షిణ్యంగా మెగా టోర్నీ నుంచి త‌ప్పించింది. వాస్త‌వానికి భార‌త్ లో ఆడేందుకు వ‌చ్చిన ఇబ్బంది ఏమీ లేక‌పోయినా.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర‌భుత్వం చేసిన చెత్త ప‌నికి ఆ దేశ క్రికెట‌ర్లు మూల్యం చెల్లించుకుంటున్నారు. భార‌త్ ప‌ట్ల విప‌రీత‌మైన ద్వేషంతో ర‌గిలిపోయే బంగ్లా తాత్కాలిక ప్ర‌భుత్వ సార‌థి యూన‌స్ నుంచి ఇంత‌కంటే ఆశించేది ఏమీ ఉండ‌ద‌ని స్ప‌ష్టమైంది. అస‌లు అశాంతి నెల‌కొన్న‌ది బంగ్లాదేశ్ లో. అక్క‌డ మైనారిటీలైన హిందువుల‌పై దాడులు జ‌రుగుతుంటే పొరుగున ఉన్న పెద్ద‌దైన‌, హిందువులు మెజారిటీగా ఉన్న‌ భార‌త దేశంలో ప్ర‌తిస్పంద‌న‌లు స‌హజం. ఈ నేప‌థ్యంలో బంగ్లా క్రికెట‌ర్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) నుంచి త‌ప్పించారు. దీనిని మ‌న‌సులో పెట్టుకున్న బంగ్లా స‌ర్కారు.. త‌మ దేశంలో ఐపీఎల్ ప్ర‌సారాల‌ను నిలిపివేసింది. ఆపై భార‌త్ లో త‌మ ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ ల వేదిక‌ల‌ను మార్చాల‌ని ప‌ట్టుబ‌ట్టింది. ఇది స‌మ‌యం రీత్యా అయ్యే ప‌ని కాద‌ని తెలిసినా.. మొండికి పోయి చేటు తెచ్చుకుంది. ఫ‌లితంగా శ‌నివారం ఐసీసీ.. బంగ్లా జ‌ట్టును టి20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పించింది. దీని స్థానంలో స్కాట్లాండ్ కు అవ‌కాశం ఇచ్చింది

ఇప్పుడు మిస్.. ఇప్పుడు ల‌క్..

స్కాట్లాండ్ క్రికెట్ క‌ల్చ‌ర్ ఉన్న దేశ‌మే. ఇంగ్లండ్ ప‌క్క‌నే ఉంటుంది. ఇప్పుడిప్పుడే స్కాట్లాండ్ మెరుగ్గా ఆడుతోంది. పెద్ద జ‌ట్టుగా ఎదిగే ల‌క్ష‌ణాలు స‌హ‌జంగానే ఉన్నాయి. అయితే, నిల‌క‌డైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నా టీ20 ప్ర‌పంచ క‌ప్ ఆడే 20 దేశాల జాబితాలో త్రుటిలో చోటు కోల్పోయింది. ఇట‌లీ వంటి ఊరుపేరు లేని జ‌ట్టుకు చోటు ద‌క్కినా... స్కాట్లాండ్ కు చాన్స్ మిస్ అయింది. అయితేనేం... ఇప్పుడు బంగ్లాదేశ్ బాయ్ కాట్ రూపంలో అవ‌కాశం వెదుక్కుంటూ వ‌చ్చింది.

మెరుగైన ర్యాంకింగ్ తో చోటు

స్కాట్లాండ్ కు మెరుగైన ర్యాంకింగ్ (14) ప్ర‌కారం టి20 ప్ర‌పంచ క‌ప్ బెర్తు ద‌క్కింది. వ‌చ్చే నెల 7న తొలి మ్యాచ్ ఆడుతుంది. ఈ జ‌ట్టు గ్రూప్ -సిలో ఉంది. ఇదే గ్రూప్ లో వీరి పొరుగు దేశం ఇంగ్లండ్ కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. ఇక గ్రూప్ సిలో మిగ‌తా జ‌ట్లు వెస్టిండీస్, ఇట‌లీ, నేపాల్ కావ‌డం గ‌మ‌నార్హం. త‌న‌దైన రోజున వీట‌న్నిటినీ ఓడించే స‌త్తా స్కాట్లాండ్ కు ఉందని చెప్ప‌వ‌చ్చు. గ‌త ఏడాది న‌మీబియా, కెన‌డాల‌పై స్కాట్లాండ్ నెగ్గింది. నెద‌ర్లాండ్స్, నేపాల్ తో జ‌రిగిన ట్రై సిరీస్ లో నెట్ ర‌న్ రేట్ ప్ర‌కారం టైటిల్ కొట్టింది. వ‌న్డేల్లో ఈ జ‌ట్టు 13వ స్థానంలో ఉంది. ఈ జ‌ట్టుకు రిచీ బెరింగ్ట‌న్ కెప్టెన్.

Tags:    

Similar News