డ్రెస్సింగ్ రూంలో క్రికెట్ దేవుడి రిటైర్మెంట్ ప్లాన్

క్రికెట్ దేవుడు అన్నంతనే గుర్తుకు వచ్చే ప్రముఖ క్రికెటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.;

Update: 2026-03-13 05:19 GMT

క్రికెట్ దేవుడు అన్నంతనే గుర్తుకు వచ్చే ప్రముఖ క్రికెటర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ ది ప్రత్యేక స్థానం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు దశాబ్దాలు ప్రపంచ క్రికెట్ ను శాసించిన సచిన్.. ఆట నుంచి రిటైర్ అయ్యే విషయంలో అతను ఎదుర్కొన్న అనుభవం గురించి తెలిస్తే కాస్తంత బాధ కలుగుతుంది. అందుకే అంటారు.. రంగం ఏదైనా ఎంట్రీ ఇవ్వటం.. సక్సెస్ ను సొంతం చేసుకోవటం.. దాన్ని నిలబెట్టుకోవటం వరకు చాలామంది తాము అనుకున్నది అనుకున్నట్లే చేస్తారు. కానీ.. ఎగ్జిట్ విషయంలో మాత్రం తప్పులు చేస్తారు. తమను తాము మరింత ఫ్రూవ్ చేసుకోవాలని భావిస్తారు.చాలా తక్కువ మంది.. వేళ్ల మీద లెక్కించేంత మాత్రమే.. అనూహ్య రీతిలో తాము ఉన్న రంగం నుంచి ఎగ్జిట్ ప్లాన్ ను ప్రకటించి..మనసుల్ని దోచేస్తారు.

అయితే.. ఈ ఘనమైన ఎగ్జిట్ అందరికి సాధ్యం కాదు.అందుకు క్రికెట్ దేవుడు సచిన్ టెండ్కూలర్ కూడా మినహాయింపు కాదు. దిగ్గజ క్రికెటర్ గా పేరున్న సచిన్ రిటైర్మెంట్ వెనుక ఉన్న ఆసక్తికర విషయాన్ని అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ తాజాగా వెల్లడించారు. అనూహ్య రీతిలో రిటైర్మెంట్ అంశం సచిన్ ముందుకు రావటంతో అతను విస్మయానికి గురయ్యాడన్న విషయం సందీప్ పాటిల్ మాటల్లో అర్థమవుతుంది. అంతేకాదు.. అప్పటికే మ్యాచ్ ఓడిన వేదనలో ఉన్న వేళ.. అనూహ్య రీతిలో డ్రెస్సింగ్ రూంలో.. అతనికి రిటైర్మెంట్ ప్లాన్ గురించి ఆలోచిస్తున్నారా? అని అడగటానికి మించిన ఇబ్బంది ఏముంటుంది?

అప్పట్లో ఏం జరిగిందో సందీప్ పాటిల్ వెల్లడించారు. అతడి మాటల్లో చెప్పాలంటే.. ‘‘2011 వన్డే ప్రపంచ కప్ విజయం తర్వాత సచిన్ తన కెరీర్ లోనే అత్యంత క్లిష్ట దశను ఎదుర్కొన్నారు. 2012లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా టూర్ లో టీమిండియా ఘోర పరాజయాలు మూటకట్టుకుంది. ఆ ఏడాదే స్వదేశంలో ఇంగ్లాండ్ తో సిరీస్ లో నాలుగు టెస్టుల్లో సచిన్ 18.6 సగటుతో 112 పరుగులు మాత్రమే చేవాడు. అప్పటికే గంగూలీ.. రాహుల్ ద్రవిడ్..వీవీఎస్ లక్ష్మణ్ రిటైర్మెంట్ ప్రకటించటంతో సచిన్ మీద ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. 2012 నాగపూర్ టెస్టులో ఓడిన తర్వాత అవినీతి నిరోధక విభాగం అనుమతి తీసుకొని డ్రెస్సింగ్ రూంలో రాజేంద్రసింగ్ హన్స్ తో కలిసి సచిన్ ను కలిశా’’ అంటూ అప్పుడేం జరిగిందో వెల్లడించారు.

మీ ఫ్యూచర్ ప్లాన్ ఏమిటని తాను సచిన్ ను అడగ్గా.. అతను ఆశ్చర్యపోయి.. ఎందుకు? అని ప్రశ్నించాడని గుర్తు చేసుకున్నారు. ‘మీ స్థానంలో అల్టర్ నేటివ్ ఆటగాడిని చూడాలని కమిటీ భావిస్తుందని చెప్పటంతో.. షాక్ తిన్న అతను మీరు సీరియస్ గా చెబుతున్నారా? అని అడిగాడు. అవునని సమాధానమిచ్చా. ఆ కఠిన నిర్ణయం బాధ కలిగించింది. ఆ తర్వాతే ఆజింక్య రహానె జట్టులోకి వచ్చాడు. ఆ సమయంలో ఆటనుకొనసాగించాలని భావించిన సచిన్.. వారానికే పాకిస్థాన్ వన్డే సిరీస్ కు ముందు వన్డే ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఏడాది తర్వాత టెస్టు క్రికెట్ కు గుడ్ బై్ చెప్పేశాడు. 2013 వెస్టిండీస్ తో జరిగిన 200వ టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తిగా గుడ్ బై చెప్పేశారు’ అంటూ అప్పటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషయం సందీప్ పాటిల్ చెప్పటం ద్వారా క్రికెట్ దేవుడి అభిమానుల్ని బాధకు గురి చేసినట్లేనని చెప్పక తప్పదు.

Tags:    

Similar News