వైసీపీకి 'ముడుపుల మత్తు'.. వదులుతుందా..?
దీంతో ఇప్పుడా పెద్దాయన వ్యవహారాన్ని తేల్చాలని సర్కారుకు ఉన్నా.. విషయాన్ని కొంత సాగదీసే ధోరణిలోనే సర్కారు వ్యూహాత్మకంగాఅడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.;
వైసీపీ హయాంలో రాష్ట్రంలో చేపట్టిన మద్యం విధానంలో ముడుపులు చోటు చేసుకున్నాయని.. డిస్టలరీ లను.. మద్యం సరఫరా దారులను కూడా.. బెదిరించి లొంగదీసుకున్నారని.. వారి నుంచి వేల కోట్ల రూపా యల సొమ్ములను కాజేశారని.. ఆరోపణలు వచ్చాయి. వీటిపై తాజాగా విచారణ చేపట్టిన సర్కారు.. ఒక్కొక్కరు కాదు.. మూకుమ్మడిగా.. వైసీపీ నాయకులను అరెస్టు చేస్తోంది. '' ఈ రోజు ఈయన.. రేపు ఎవరు అరెస్టు అవుతారో'' అని వైసీపీ చర్చించుకునే పరిస్థితిని తెచ్చింది.
ఈ క్రమంలోనే సజ్జల శ్రీధర్‌రెడ్డి సహా.. అనేక మంది ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ముఖ్యమైన కసిరెడ్డి రాజ్ వ్యవహారం గుట్టు వీడడంతో సర్కారు దూకుడు పెంచింది. అయితే.. ఇంత చేసినా.. వైసీపీ ముడుపుల మత్తు వదులుతుందా? అనేది కీలక ప్రశ్న. దీనికి ప్రధానంగా.. అన్ని వేళ్లు అప్పటి సీఎం జగన్ వైపే చూపిస్తున్నాయి. ఎవరిని విచారించినా.. పెద్దాయన చేయమన్నాడనే చెబుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
దీంతో ఇప్పుడా పెద్దాయన వ్యవహారాన్ని తేల్చాలని సర్కారుకు ఉన్నా.. విషయాన్ని కొంత సాగదీసే ధోరణిలోనే సర్కారు వ్యూహాత్మకంగాఅడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు ఏదీ కూడా.. వెంటనే చేయరన్న టాక్ ఉన్న విషయం తెలిసిందే. ముందుగా.. తాను చేయాల్సిన విషయాన్ని ప్రజలకు వివరించి.. ప్రజల్లో వ్యతిరేకత, లేదా.. సానుకూలతను పెంచి.. తర్వాత.. నిర్ణయం తీసుకుని అడుగులు వేస్తారు.
లేకపోతే.. మద్యం కుంభకోణం వంటి కేసుల్లో వైసీపీ పెద్దాయనను ఉన్నట్టుండి అరెస్టు చేస్తే.. సర్కారుపై వ్యతిరేకత.. అదేసమయంలో వైసీపీపై సానుకూలత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని ముందు గానే.. గుర్తించిన చంద్రబాబు.. కసిరెడ్డి నుంచి సజ్జల శ్రీధర్‌వరకు అందరి నోటా.. పెద్దాయన పేరు వచ్చేలా చేస్తున్నారు. తద్వారా.. తర్వాత.. సదరు పెద్దాయనను అరెస్టు చేసినా.. ప్రజల్లో సానుభూతి పాళ్లు పెరగకుండా చూసుకుంటున్నారు. దీంతో ఈ వ్యవహారం.. కొంత ఆలస్య మయ్యే అవకాశం ఉందని.. అంటున్నారు పరిశీలకులు.