జగన్ స్టైల్ మార్చారా...వారితో కనెక్ట్ అయ్యేందుకేనా ?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్టైల్ మార్చారా అన్నది చర్చ సాగుతోంది. అదే అంతటా హాట్ టాపిక్ గా ఉంది.;

Update: 2026-05-01 18:30 GMT

వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్టైల్ మార్చారా అన్నది చర్చ సాగుతోంది. అదే అంతటా హాట్ టాపిక్ గా ఉంది. జగన్ స్టైల్ మార్చడమేంటి అన్నది కూడా ఒక ప్రశ్న అయితే దాని వెనక దాని వెనక చాలా ఆసక్తికరమైన వ్యవహారాలే ఉన్నాయని అంటున్నారు. మామూలుగా జగన్ గురించి చూస్తే కనుక ఆయన 2011 నుంచి ప్రజా జీవితంలో ప్రజలకి బాగా పరిచయంగా ఉన్న నాయకుడు. వైసీపీ పేరుతో పార్టీ పెట్టి జనంలోకి వచ్చిన జగన్ కొత్తలలో రంగురంగుల బట్టలు వేసుకుని తిరిగేవారు. అదే విధంగా ఆయన డ్రెస్ కోడ్ అన్నది ఆ రోజుల్లో పెద్దగా పాటించలేదు. అయితే జగన్ 2017 లో పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఒక స్పెషల్ డ్రెస్ కోడ్ ని అలవాటు చేసుకున్నారు. అదే ఖాకీ ప్యాంటు తెల్ల చొక్కా. ఇది గడచిన ఏడెనిమిది సంవత్సరాలుగా జగన్ డ్రెస్ కోడ్ గా అందరికీ తెలుసు.

కొత్త ఇమేజ్ తో :

జగన్ ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే రకమైన డ్రెస్ కోడ్ తో జనంలో కనిపించేవారు. అయితే వైసీపీ 2024 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత జగన్ పెద్దగా జనాల్లోకి రావట్లేదు. అదే సమయంలో ఆయన వారంలో కొన్ని రోజులు తాడేపల్లికి వచ్చి పార్టీ కార్యక్రమాలు చూస్తొ వెళ్ళిపోతున్నారు. ఇదిలా ఉంటే జగన్ ఇటీవల లండన్ టూర్ పెట్టుకున్నారు ఈ టూర్ కి ముందు ఆయన ఒక స్పెషల్ డ్రెస్ లో కనిపించి ఆశ్చర్యపరిచారు. దానికి సంబంధించిన ఫోటోలు అన్నీ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. జగన్ బ్లూ కలర్ జీన్స్ అండ్ బ్లూ కలర్ షర్టుతో చాలా వెరైటీగా కనిపించారు. ఇదే తరహాలో ట్రెండీ లుక్ తో ట్రెండీ డ్రెస్ తో జగన్ ఫారిన్ టూర్ లో పర్యటిస్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం కనిపిస్తున్నాయి.. దీన్ని చూసిన వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు మా నాయకుడు కొత్త ఇమేజ్ తో కనిపిస్తున్నారని ఆనందిస్తున్నారు.

యూత్ లుక్ తో జగన్ :

తమ నాయకుడు జగన్ యూత్ ఫుల్ ఇమేజ్ తో కనిపిస్తున్నారని కూడా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతుంది. అయితే దీని వెనక జగన్ వ్యూహం కూడా ఉందని ప్రచారం అయితే సాగుతోంది. ఏమిటీ ప్రచారం అంటే ఇంతకాలం పెద్దమనిషి తరహాలో జగన్ ఒక డ్రెస్ కోడ్ మెయిన్ టెయిన్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయన డ్రెస్ కోడ్ కూడా మార్చబోతున్నారు అన్న చర్చ కూడా సాగుతోంది. ఇక ఆ డ్రెస్ కోడ్ ట్రెండీగా ఉండేలా చూసుకుంటారు అని కూడా అంటున్నారు. ప్రస్తుతం దేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ జెన్ జెడ్ ప్రభావం అధికంగా ఉంది. వాళ్లే ఎన్నికల్లో అత్యంత ప్రభావం చూపించే ఓటర్లుగా మారుతున్నారు. వారు కనుక ఎన్నికల్లో తమ ప్రతాపం చూపిస్తే ఆయా పార్టీలకే విజయం దక్కడం అన్నది కూడా జరుగుతోంది. ఇక జగన్ ప్రస్తుతం వయస్సు 50 ప్లస్ గా ఉంది. ఒక విధంగా రాజకీయంగా ఆయన యువకుడి కిందనే లెక్క అని చెప్పుకున్నా మరో విధంగా చూస్తే ఈ జెడ్ జెడ్ కి వైసిపి కొంత దూరంగా ఉన్నట్టుగానే కనిపిస్తోంది.

గ్యాప్ ని తగ్గించాలనే :

దాంతో ఆ గ్యాప్ ని తగ్గించాలన్న ఉద్దేశంతోనే జగన్ కొత్త ఆలోచనలు చేస్తున్నారా అని చర్చ సాగుతోంది. అదే విధంగా జగన్ రేపటి రోజున జెన్ జెడ్ ఓటర్లను ఆకట్టుకోవడానికి తనదైన కొత్త వ్యూహాలతో ముందుకు వస్తారని కూడా అంటున్నారు. అందులో భాగమేనా ఈ నయా డ్రెస్, ఈ కొత్త సరికొత్త ట్రెండీ డ్రెస్ అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. అయితే జగన్ ఎప్పుడు యూత్ తో కనెక్ట్ అవుతూనే ఉన్నారని ప్రత్యేకంగా ఏ రకమైన వ్యూహాలు రూపొందించాల్సిన అవసరం లేదని వైసీపీ నాయకులు చెబుతున్నారు. మొత్తానికి జగన్ పాదయాత్ర అయితే తొందరలో చేయబోతున్నారు. మరి ఆ పాదయాత్రలో జగన్ డ్రెస్ కోడ్ ఏ విధంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఆయన జెన్ జెడ్ ని ఏ రకంగా ఎట్రాక్ట్ చేస్తారు అన్నది వేచి చూడాల్సి ఉంది.

Tags:    

Similar News