• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  చిన్నపిల్లల సైకిల్ పై...

చిన్నపిల్లల సైకిల్ పై వైసీపీ పెద్దల ప్రతాపం... లోకేష్ ధ్వజం!

| గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నేతలు మరింత ప్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారని టీడీపీ నేతలు నిత్యం ఆరోపిస్తుంటారు! దానిని నిజం చేస్తున్నట్లుగా తాజాగా చిన్నపిల్లాడిపైనా వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారు!

By - Tupaki Desk
Update: 2025-06-02 08:17 GMT

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం వైసీపీ నేతలు మరింత ప్రస్ట్రేషన్ లోకి వెళ్లిపోయారని టీడీపీ నేతలు నిత్యం ఆరోపిస్తుంటారు! దానిని నిజం చేస్తున్నట్లుగా తాజాగా చిన్నపిల్లాడిపైనా వైసీపీ నేతలు వికృత చేష్టలకు పాల్పడ్డారు! ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

అవును... పసుపు రంగు జెండా చూస్తే వైసీపీ నేతలు ఎర్రెత్తిపోతున్నారంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తుంటారు. ఇక.. సైకిల్ చూసినా వారు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నట్లున్నారని ఎద్దేవా చేస్తుంటారు. ఈ క్రమంలో తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ సందర్భంగా జరిగిన ఓ ఘటన ఈ వాదనకు బలం చేకూరుస్తూ.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇటీవల జోగి రమేష్ కుమారుడు వివాహ వేడుక కోసం వైసీపీ అధినేత జగన్ ఇబ్రహీంపట్నం వచ్చారు. ఆ సమయంలో కొంతమంది స్థానిక వైసీపీ శ్రేణులు రోడ్డు వెంట ఓ చిన్నపిల్లాడి సైకిల్ లాగి ధ్వంసం చేశారు! దీన్ని టీడీపీ మద్దతుదారులను రెచ్చగొట్టే చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు. చిన్నారి సైకిల్ లాక్కొని, కిందపడేసి తొక్కడం ఇదేమి పైశాచికానందం అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఇందులో భాగంగా... "అబ్బే వాళ్ళేమీ మారలేదు.. వాళ్ళేమీ మారరు కూడా" అని మొదలుపెట్టిన లోకేష్.. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో కానీ, ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు.. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ, వాళ్ళకి సైకో నాయకుడు! అంటూ ధ్వజమెత్తారు.

ఇదే సమయంలో... ప్రజలు బుద్ది చెప్పినా వారని వాళ్ల ఆలోచనలను, చిన్న పిల్లవాడి చేతిలో నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ, విరగ్గొడుతూ వాళ్లు చేస్తున్న వికృత చేష్టలను సమాజం మరింతగా అర్ధం చేసుకోవాలని రాస్తూ.. ఈ వీడియోను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.

మరోపక్క వైసీపీ శ్రేణులు ధ్వంసం చేసిన బాలుడి సైకిల్ కు బదులుగా టీడీపీ నాయకులు, కౌన్సిలర్లు ఆదివారం కొత్త సైకిల్ ను అందజేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

#PsychoJagan #YSRCPRowdyism అబ్బే వాళ్ళేమీ మారలేదు..... వాళ్ళేమీ మారరు కూడా..... ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో... ఆ పేరును సార్ధకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికి నేటికీ ఎప్పటికీ అదొక సైకో పార్టీ... వాళ్ళకి సైకో నాయకుడు! ప్రజలు బుద్ధి చెప్పినా మారని… pic.twitter.com/8fKlFYmG2o

— Lokesh Nara (@naralokesh) June 1, 2025
Tags:    
  • YCPleaders 
  • Childbicycledestruction 
  • Politicalviolence 
  • Andhrapradesh 
  • Naralokesh 
  • TDPcriticism 
  • Jogiramesh 
  • Viralvideo 
  • Politicalcontroversy 
  • YCPvsTDP 
  • Latestnews 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS