• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్ తో ఫోటో కోసం ఇంటి...

జగన్ తో ఫోటో కోసం ఇంటి ముందు బైఠాయింపు? ఆ తర్వాత మరో ట్విస్టు

| ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఎదుట ఒక మహిళ వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది.

By - Tupaki Desk
Update: 2025-02-08 05:00 GMT

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం ఎదుట ఒక మహిళ వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది. అద్దంకికి చెందిన ఆమె.. జగన్మోహన్ రెడ్డితో ఫోటో కోసం పెద్ద ఎత్తున ప్రయత్నించింది. ఒక దశలో ఫోటో తీయిస్తే తప్పించి.. తాను అక్కడి నుంచి కదలనని మొండిపట్టును ప్రదర్శించింది. బాపట్ల జిల్లాకు చెంది అద్దంకికి చెందిన సిద్ధారపు అంజమ రెడ్డి హడావుడితో.. ఆమె వివరాల్ని జగన్ వ్యక్తిగత సిబ్బందికి అందజేశారు.

వైఎస్ జగన్ తో ఫోటో దిగే వరకు తిరిగి వెళ్లనని మొండిపట్టును ప్రదర్శిస్తున్న విషయాన్ని చెప్పటంతో.. వైసీపీ గ్రీవెన్ సెల్ రాష్ట్ అధ్యక్షుడు నాగ నారాయణమూర్తి ఆమెను తీసుకొని తాడేపల్లి లోని జగన్ నివాసానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను జగన్ తో ఫోటో తీయించారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆమె కొత్త ట్విస్టుకు తెర తీసింది.

తనకు అప్పులు ఉన్నాయని. అందుకు జగన్ సాయం చేయాలని కోరుతూ ఇంటి ముందు ఉండిపోయింది. ఎంత నచ్చజెప్పినా ఒప్పుకోకపోవటంతో ఆమెకు సంబంధించిన సమాచారాన్ని తాడేపల్లి పోలీసులకు అందించారు. దీంతో సీఐ కల్యాణ్ రాజు అక్కడికి చేరుకొని సదరు మహిళను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ఆమె వివరాల్ని సేకరించి.. ఆమెకు కొద్దిపాటి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. అభిమానం పేరు చెప్పి ఫోటో కోసం ప్రయత్నం చేయటం.. ఆ తర్వాత తనకున్న అప్పుల్ని తీర్చాలన్న సదరు మహిళ తీరు స్థానికంగా సంచలనంగా మారింది.

Tags:    
  • Gunturwoman 
  • Jaganresidence 
  • Jagan 
  • Appolitics 
  • YSRCP 
  • Naganarayanmurthy 
  • Debtclearence 

Similar News

పెళ్లి కోసం 7 వేల మంది క్యూ.. ఇంత కరువులో ఉన్నారేంట్రా సామీ

2026-11-03 16:30 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

తిండి క‌ల్తీ.. నెయ్యి క‌ల్తీ.. స‌మాజం క‌ల్తీ.. లైసెన్సులు ర‌ద్దు చేస్తున్న FDA

2026-11-03 14:30 GMT

వాసిరెడ్డి ప‌ద్మ వార‌సురాలి విజ‌యం!

2026-11-03 12:30 GMT

అదృష్టం తలుపుతట్టింది.. వైసీపీ అభ్యర్థికి లాటరీలో విజయం దక్కింది..

2026-11-03 12:22 GMT

గోదావ‌రి జిల్లాల్లో జ‌న‌సేన జోరు!

2026-11-03 11:30 GMT

ఒక‌వైపు ముర‌సు.. మ‌రోవైపు కౌంటింగ్‌.. ఊపిరాడితే ఒట్టు!

2026-11-03 10:56 GMT

ఈ పోలింగ్ ఫ‌స్ట్ ఎపిసోడ్‌... ఏం నేర్పుతోంది.. !

2026-11-03 10:55 GMT

ప్ర‌క్షాళ‌న త‌ప్ప‌దా.. అంతా అయ్యాక ఇదే హాట్ టాపిక్‌.. !

2026-11-03 10:30 GMT

ఇక బెట్టింగులు.. ఎవ‌రికోస‌మంటే.. !

2026-11-03 10:04 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

Copyright @2026

Powered by Blink CMS