• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  అర్ధరాత్రి...

అర్ధరాత్రి స్వాతంత్ర్యం...అచ్చి వచ్చిందా ?

| దేశానికి వందల ఏళ్ళ బానిసత్వం తరువాత స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ వారి చెరలో రెండు వదల ఏళ్ల పాటు భారత్ మగ్గింది.

By - Satya P
Update: 2026-08-15 02:22 GMT

దేశానికి వందల ఏళ్ళ బానిసత్వం తరువాత స్వాతంత్ర్యం వచ్చింది. బ్రిటిష్ వారి చెరలో రెండు వదల ఏళ్ల పాటు భారత్ మగ్గింది. ఎన్నో పోరాటాలు మరెన్నో ఉద్యమాలు ప్రాణ త్యాగాలు ఆత్మా హుతి చేసుకున్న యువత ఇలా దేశం ఎంతగానో నష్టపడి కష్టపడి చివరికి 1947లో దేశానికి స్వాతంత్ర్యం సంపాదించుకుంది. బ్రిటిష్ వారికి ఏమి పోయింది వారు తమ దేశానికి పోయే తొందరలో ఉన్నారు. దాంతో ఇండియా పాకిస్తాన్ ని రెండు ముక్కలు చేసి సంతృప్తి చెందారు. అదే సమయంలో మనకూ స్వాతంత్ర్యం ఇచ్చేస్తామని అన్నారు. సరిగ్గా ఇక్కడే మన దేశ సెంటిమెంట్లు జ్యోతీష్య శాస్త్రాలు పండితుల సూచనలు అడ్డు పడ్డాయి. మంచి ముహూర్తంతో దేశానికి స్వాతంత్ర్యం రావాలి కానీ ఆదరా బాదరాగా కాదు అని ఒక వైపు సనాతనులు వాదించారు. అదే సమయంలో అభ్యుదయవాదులు స్వాతంత్ర్యం వచ్చింది కదా దానికి ముహూర్తాలు సంప్రదాయాలు ఏమిటి అని రచ్చ చేశారు. ఇది ఎటూ తేలక పోయింది. మొత్తానికి ఉన్న ముహూర్తంలోనే అంటే బ్రిటిష్ వారు చెప్పిన సమయంలోనే కాస్తా మంచిది అనుకుని అర్ధరాత్రి స్వాతంత్ర్యం ఈ దేశం అందుకుంది.

చీకట్లో వెలుగు రేఖలు :

మరి ఇక్కడ సరైనా ముహూర్తం కుదిరిందా అంటే ఉన్నంతలో మెరుగు అనుకుని అలా చేశారు. నిజానికి దేశానికి అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చినపుడు శ్రావణమాసం చతుర్దశి తిథి నడుస్తోంది. చతుర్దశిని ఎవరూ మంచి తిధిగా భావించరు. కానీ అమావాస్య కంటే బెటర్ అది అని ఒప్పుకోవాల్సి వచ్చింది అంటారు. అలా చూస్తే కనుక భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అర్ధరాత్రి సమయాన్ని ఎంచుకోవడం వెనుక వేద జ్యోతిష్య శాస్త్ర లెక్కల ఆధారంగా అనుకూలమైన శుభ ముహూర్తాన్ని నిశ్చయించే ప్రయత్నం జరిగింది అని చెప్పాల్సి ఉంది.

అభిజిత్ ముహూర్తంగా :

ఇక ఆ సమయంలో పగటి పూట దినం సరిపోకపోయినా ఆగస్టు 14 నుండి 15కి మారే అర్ధరాత్రి సమయంలో గ్రహాల స్థితిగతులు దేశ భవిష్యత్తుకు అనుకూలంగా ఉంటాయని అప్పట్లో జ్యోతిష్య పండితులు భావించారు. అలా జ్యోతిష్య కారణాలు వాటికి సంబంధించిన లెక్కలు అన్నీ కలసి అభిజిత్ ముహూర్తంగా నిర్ణయించాయి. జ్యోతీష్య శాస్త్రంలో చూస్తే పగలు రాత్రి మధ్య వచ్చే అర్ధరాత్రి సమయం అభిజిత్ ముహూర్తానికి చెందుతుంది అని పండితులు చెబుతారు. అలా జ్యోతిష్యంలో తగిన సమయం దొరక్కపోతే ఈ ముహూర్తాన్ని అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు అని అంటారు. ఇక 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి సమయంలో స్థిరత్వం ఇచ్చే వృషభ లగ్నం ఉదయించింది, దీంతో ఇది దేశానికి మేలు చేసేదిగానే జ్యోతీష్య పండితులు భావించారు.

సంప్రదాయాలను గౌరవించుకున్నాం :

దాని కారణంగానే ఈ రోజుకీ దేశంలో బలమైన ప్రజాస్వామ్యానికి స్థిరమైన ప్రభుత్వానికి ఇది అండగా ఉందని అంటారు. ఇక పుష్య నక్షత్రం ఆ సమయంలో ఉంది. అలా ఆ సమయంలో మహా నక్షత్రంగా పిలిచే పుష్య నక్షత్రం ఉండటం రాజ్య స్థాపనకు కొత్త దేశ ఆవిర్భావానికి ఎంతో అనుకూలమని నిపుణులు అంచనా వేశారని అంటారు. ఇలా కొన్ని కుదిరాయి, కొన్ని కుదరలేదు, మొత్తం మీద దేశానికి స్వాతంత్ర్యం ఇవ్వడం కూడా బ్రిటిష్ వారు అనుకున్న సమయానికే జరిగింది. అయితే పగలు నుంచి రాత్రికి మార్చి మన సంప్రదాయాలను గౌరవించుకున్నాం. ఇదన్న మాట అర్ధరాత్రి స్వాతంత్ర్యం కధ.

Tags:    
  • independenceday 
  • indiaindependence 
  • august15 
  • india1947 
  • indianhistory 
  • independenceofindia 
  • midnightindependence 
  • freedomstruggle 

Similar News

2019 లెక్కలు వేరు.. 2024 తర్వాత పరిస్థితి వేరు : జగన్ కేసుల్లో ఈడీ దూకుడుకు కారణమిదేనా?

2026-11-18 11:46 GMT

టెక్నాలజీనే టెన్షన్ పెడుతోంది.. టెక్ ప్రపంచానికి పీడకలగా నవంబర్

2026-11-18 11:29 GMT

హైదరాబాద్ హోటళ్లలో బొద్దింకలు.. గడువు ముగిసిన సాసులు కూడా!

2026-11-18 11:28 GMT

జెండా గుర్తును జేబులో పెట్టుకున్న మోడీ.. పక్కనే ఉన్న ట్రంప్ ఏమన్నారంటే?

2026-11-18 11:22 GMT

ఖబర్దార్ బిడ్డా.. యుద్ధం స్టార్ట్ అవుతది.. రేవంత్‌రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

2026-11-18 10:06 GMT

ఎన్టీఆర్ విగ్రహానికి అయ్యే ఖర్చుతో మెడికల్ కాలేజీలు కట్టొచ్చు కదా.. ప్రభుత్వానికి పేర్ని నాని సూటి ప్రశ్న

2026-11-18 10:02 GMT

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

గ్రామ సర్పంచ్ : పదవి మాత్రమే కాదు.. ఊరి గుండె చప్పుడు!

2026-11-18 09:55 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..

2026-11-18 07:13 GMT

ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!

2026-11-18 07:07 GMT

వారం రోజుల్లో 2 లక్షల కాపీలు.. సోనియా గాంధీ పుస్తకానికి భారీ స్పందన!

2026-11-18 07:06 GMT

Copyright @2026

Powered by Blink CMS