విజయసాయిరెడ్డి షాకింగ్ ట్వీట్...పొలిటికల్ వైరల్
సరిగ్గా ఇదే సందర్భంలో విజయసాయిరెడ్డి ఊహించని విధంగా ఖర్గేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.;
వైసీపీ పునాదుల నుంచి ఉంటూ జగన్ కి చేదోడు వాదోడుగా మెలిగిన విజయసాయిరెడ్డి ఇపుడు మాజీ పొలిటీషియన్. ఆయన ఆరేడు నెలల క్రితం వైసీపీని వీడారు. ఆ పార్టీ పార్టీ సభ్యత్వం తో పాటు రాజ్యసభ సీటుని ఇంకా మూడున్నరేళ్ల పదవీ కాలం ఉండగానే వదులుకున్నారు.
ఇక ఆయన బీజేపీలో చేరుతారని ఆ మధ్యన పుకార్లు షికారు చేశాయి. ఇక ఆయన వైసీపీకి ఎదురు నిలిచారు. ఒక దశలో జగన్ కోటరీ మీద తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు ఇపుడు చూస్తే సైలెంట్ అయ్యారు. గత కొంతకాలంగా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి పొలిటికల్ ట్వీట్ అయితే ఒక్కటి కూడా రాలేదు. కానీ సడెన్ గా మాత్రం ఆయన షాకింగ్ ట్వీట్ వేసారు.
అది కూడా పొలిటికల్ గా వైరల్ అయ్యేలా ఆ ట్వీట్ ఉంది. ఇంతకీ విజయసాయిరెడ్డి చూస్తే విజయసాయిరెడ్డి బిగ్ ట్విస్ట్ ఇచ్చారే అన్నట్లుగానే ఉంది. సోమవారం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజుని కాంగ్రెస్ అగ్ర నేతలు అంతా ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు అంతా కలిసి ఆయన చేత కేక్ కట్ చేయించారు.
సరిగ్గా ఇదే సందర్భంలో విజయసాయిరెడ్డి ఊహించని విధంగా ఖర్గేకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్లలో ఒకరు ఆయన అని కితాబు ఇచ్చారు ఆయనకు మంచి ఆరోగ్యం కలగాలని దేశానికి మరింతగా సేవ చేయాలని కోరుకుంటున్నట్లుగా ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన నేపథ్యంలో సజావుగా సమావేశాలు సాగాలని విజయసాయిరెడ్డి కోరుకున్నారు. నిర్మాణాత్మకంగా సమావేశాలు సాగాలని ఆటంకాలు లేకుండా ఉండాలని ఆశించారు. అంతే కాదు చర్చల ద్వారా ప్రభుత్వాన్ని జవాబుదారీగా చేసినపుడే ప్రజాస్వామ్యం ఉత్తమంగా పనిచేస్తుందని కూడా ఆయన సూచించడం విశేషం.
పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కి ఆయన ఈ సూచన చేయడం విశేషం అని అంటున్నారు. ఇక విజయసాయిరెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన ఏదో నాటికి తిరిగి వైసీపీలో చేరుతారని కూడా పుకార్లు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సైలెంట్ గా ఉంటూనే కాంగ్రెస్ అధ్యక్షుడుకి గ్రీట్ చేయడం విశేషం.
కాంగ్రెస్ అంటే అంత ఎత్తున లేచే వైసీపీలో నిన్నటి దాకా పనిచేసిన నాయకుడిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పెట్టిన కేసుల వల్ల ఆయన కూడా జగన్ తో పాటు 16 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. కాంగ్రెస్ ని ఆయన కూడా వైసీపీలో ఉన్నపుడు పూర్తిగా వ్యతిరేకించడమే కాకుండా ఎండగడుతూ వచ్చారు.
ఇక ఆయన జాతీయ రాజకీయాలలో చూస్తే బీజేపీ పెద్దలకు బహు దగ్గర అయ్యారు. వారితో సన్నిహిత సంబంధాలు నెరిపారు. ఆయన రాజ్యసభలో వైసీపీ ఫ్లోర్ లీడర్ గా ఉండగా అనేక సందర్భాలలో చర్చల సందర్భంగా కాంగ్రెస్ నే విమర్శిస్తూ వచ్చిన సంగతినీ అంతా చూశారు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ బీజేపీకి అనుకూలంగా ఆయన పెద్దల సభలో గళం విప్పడమూ జరుగుతూ వచ్చింది.
ఇక మల్లికార్జున ఖర్గే పుట్టిన రోజు ఈ ఏడాదే రాలేదు. ఆయన ఎనభై ఏళ్ళకు పైబడిన కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు. మరి ఇన్ని పుట్టిన రోజులూ లేని ట్వీట్ ఇపుడే విజయసాయిరెడ్డి చేయడం వెనక ఏమి ఉంటుంది అన్న్నదే రాజకీయంగా చర్చగా ఉంది. ఆయనకు బీజేపీ పెద్దల నుంచి పెద్దగా స్పందనలు లేకపోవడంతో రూట్ ఏమైనా మార్చి కొత్త పాలిటిక్స్ కి తెర తీస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.
దేశంలో కాంగ్రెస్ ఇపుడిపుడే పుంజుకుంటోంది. 2024 ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. మరో నాలుగేళ్ళ తర్వాత జరిగే ఎన్నికల్లో మరింతగా యాంటీ ఇంకెంబెన్సీ రావడం తధ్యం. మరి అదే కనుక జరిగితే కాంగ్రెస్ కి మరింత అడ్వాంటేజ్ అని అంటున్నారు. ఒక్కసారి కనుక కాంగ్రెస్ జాతీయ స్థాయిలో పుంజుకుంటే ఏపీలో కూడా పొలిటికల్ సీన్ మారుతుంది అన్నది కూడా ఉంది. మరి రాజకీయ వ్యూహకర్త అయిన సాయిరెడ్డి ఇవన్నీ ముందే ఊహించి హస్తంతో చెలిమికేనా ఈ ట్వీట్ వేశారు అన్నది చర్చగా ఉందిట.