• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ‘పిల్లలకు సోషల్ మీడియా...

‘పిల్లలకు సోషల్ మీడియా నిషేదం’... సాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

| ఈ సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై తాజాగా వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

By - Tupaki Desk
Update: 2024-11-30 05:23 GMT

చదువుకుంటున్న వయసులో, ఎదుగుతున్న దశలో పిల్లలపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. ఇందులో మంచి కంటే చెడు పాళ్లు చాలా ఎక్కువనే ఆందోళనలు తీవ్రమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై తాజాగా వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

అవును... ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని నిర్ణయిమింది. తల్లితండ్రుల నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో... దీనికి సంబంధించిన బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చాలా మంది పేరెంట్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో.. సోషల్ మీడియా విషయంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయన్ని భారతీయులూ స్వాగతిస్తున్నారు. ఇది సరైన నిర్ణయమని, సహేతుకమైన నిర్ణయమని అంటున్నారు. ఈ సమయంలో ఎంపీ సాయిరెడ్డి స్పందించారు.

ఇందులో భాగంగా... 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించడాన్ని ఆస్ట్రేలియా నిషేధించిందని పేర్కొన్న వైసీపీ ఎంపీ, ఆ పార్టీ కీలక నేత విజయ సాయిరెడ్డి.. నిపుణులు, తల్లితండ్రులు, ఉపాధ్యాయుల సలహా తీసుకున్న తర్వాత భారతదేశంలోనూ ఇలాంటి చట్టాన్ని అమలు చేయడానికి తాను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.

ఇదే సమయంలో... ఇలాంటి నిర్ణయం వల్ల పిల్లల సమయం వృధా కాకుండా ఉండటమే కాకుండా సోషల్ మీడియా దుష్ప్రభావాల నుంచి కూడా సురక్షితంగా ఉంటారని విజయ సాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

కాగా.. ఇదే విషయంపై ఇప్పటికే స్పందించిన జనసేన నేత నాగబాబు... 16 ఏళ్ల లోపు టీనేజర్స్ కి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని.. ఇది ఒక రకంగా బావితరాల బంగారు భవిష్యత్తుకి బాసటగా నిలుస్తుందని అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

ऑस्ट्रेलिया ने 16 साल तक के बच्चों के सोशल मीडिया इस्तेमाल पर पाबंदी लगा दी है। केंद्र सरकार से मेरी अपील है कि वह विशेषज्ञों, अभिभावकों और शिक्षकों की सलाह लेकर ऐसा ही कानून भारत में भी लागू करे। इससे बच्चे न केवल अपना समय बर्बाद होने से बचाएँगे, बल्कि सोशल मीडिया के बुरे…

— Vijayasai Reddy V (@VSReddy_MP) November 30, 2024
Tags:    
  • Vijayasaireddy 
  • MP 
  • YCP 
  • Socialmedia 
  • Childrens 
  • Phoneusage 
  • Vijayasaireddytweets 
  • Australia 
  • Anthonyalbanese 
  • YcpMp 
  • Andhrapradesh 

Similar News

మూడు ముళ్ల బంధం.. రూ. 7.50 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం!

2026-11-19 19:30 GMT

వీఐపీలు వస్తేనే ముంబైకి అందం.. సామాన్యులు ఉంటే ఎందుకీ దుర్గంధం?

2026-11-19 18:30 GMT

సహచరుల వద్ద తలెత్తుకోలేకపోతున్నా.. ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోండి! – టీడీపీ ఎమ్మెల్యే థామస్ సంచలన వ్యాఖ్యలు

2026-11-19 17:30 GMT

AI హడావుడి.. సినిమాకు ఒరిగిందేంటి!

2026-11-19 17:30 GMT

పార్టీలు, ఫంక్షన్లు జరగాలంటే ఆ రూల్స్ పాటించాలా?

2026-11-19 16:30 GMT

చంద్రబాబు దెబ్బకు తమిళనాడులో అలజడి!? ఏపీకి డేటా లీక్, 15 మందిపై వేటు! నిజమేనా?

2026-11-19 15:30 GMT

ఆ ఒక్క తప్పు చేస్తే మళ్లీ కష్టాలే : ప్రధాని మోదీ హెచ్చరిక.. తినడం, తిరగడం, తాగడంపై ఆసక్తికర వ్యాఖ్యలు

2026-11-19 14:30 GMT

లక్ష కోట్ల సామ్రాజ్యానికి ఏకైక రారాజు.. మేఘా కృష్ణారెడ్డి విజయ ప్రస్థానంలో చరిత్రాత్మక మైలురాయి..

2026-11-19 13:40 GMT

వైసీపీలో 'యాక్టింగ్' ఇన్‌ఛార్జ్‌ల మాయాజాలం ?

2026-11-19 13:37 GMT

'కాక్రోచ్ జనతా పార్టీ' గప్‌చుప్ అయిందా? వ్యూహం మార్చిందా? సీజేపీ అడుగులు ఎటువైపు!

2026-11-19 13:30 GMT

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

Copyright @2026

Powered by Blink CMS