పీకేకి సంబంధించి వీడియో వైరల్... గట్టిగా తగులుకున్న వైసీపీ!

వివరాళ్లోకి వెళ్తే... "ది వైర్‌" తరఫున సీనియర్‌ జర్నలిస్ట్‌ కరణ్‌ థాపర్‌... ప్రశాంత్‌ కిషోర్‌ ను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా... గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారని కరణ్‌ థాపర్‌ ప్రశ్నించారు.

Update: 2024-05-23 08:18 GMT

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది.. జూన్ 4న ఫలితాలు రాబోతున్నాయి.. జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్స్ ప్రసారం చేయడానికి ఈసీ అనుమతి ఇవ్వలేదు! ఆ సంగతి అలా ఉంటే... ఎన్నికల సమయంలో పలు సర్వేలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. సరే.. అందులో దేని క్రెడిబిలిటీ ఏమిటనే సంగతి కాసేపు పక్కనపెడితే... "సర్వేలు ఏమీ చేయలేదు కానీ.." అంటూ జోస్యాలు చెప్పేవారూ తెరపైకి వచ్చేశారు!

అవును... అత్యంత ఆసక్తికరంగా జరిగిన ఏపీ ఎన్నికలపై పలు సర్వేలు హల్ చల్ చేశాయి. ఇందులో ఆయా సర్వే సంస్థలు.. వారు సేకరించిన శాంపుల్స్ ఎన్ని, ఎక్కడెక్కడ సేకరించారు మొదలైన విషయాలు వెల్లడించి.. వారి సర్వే లెక్కలు వివరించారు. ఈ సమయంలో కొంతమంది మాత్రం తామేమీ సర్వేలు చేయలేదు అని చెబుతూనే... వారి వారి కోరికలను విశ్లేషణలుగా చెప్పే ప్రయత్నం చేశారనే విమర్శలు తెరపైకి వచ్చాయి!

ఆ సంగతి అలా ఉంటే... ఏపీలో సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల వ్యూహకర్తగా ఏ పార్టీకి పని చేయడం లేదంటూనే.. మరోవైపు రాజకీయ వ్యూహకర్త హోదాలో ఎన్నికల ఫలితాలపై జోస్యాలు చెబుతున్నారు ప్రశాంత్‌ కిషోర్‌! ఇందులో ప్రధానంగా ఏపీలో వైసీపీ అధికారంలోకి రాదని.. జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు.. అవి గ్రామీణ ప్రాంత ప్రజలకు నచ్చొచ్చు కానీ.. అర్బన్ ప్రాంత ప్రజలకు నచ్చవని చెప్పుకొస్తున్నారు.

ఈ సమయంలో వైసీపీ ఒక వీడియోను పోస్ట్ చేసింది. అది పీకేని ఒకరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పటి వీడియో.. ఇందులో 2022లో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఓటమి ఖాయామంటూ పీకే వేసిన అంచనా తప్పిందంటూ ప్రముఖ జర్నలిస్ట్ కరణ్ థాపర్ ఆధారాలతో ప్రశ్నించడం కనిపిస్తుంది. దీంతో... "ఆయన అంచనాలు తప్పు అని నిరూపితమయ్యాయి.. చంద్రబాబు కొత్త ప్యాకేజీ స్టార్ గా ప్రశాంత్ మారారు" అని వైసీపీ రాసుకొచ్చింది.

Read more!

వివరాళ్లోకి వెళ్తే... "ది వైర్‌" తరఫున సీనియర్‌ జర్నలిస్ట్‌ కరణ్‌ థాపర్‌... ప్రశాంత్‌ కిషోర్‌ ను ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా... గతంలో హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోతుందని ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పారని కరణ్‌ థాపర్‌ ప్రశ్నించారు. అయితే.. తానేమీ అలా జోస్యాలు చెప్పే వ్యాపారంలో లేనంటూ పీకే మాట్లాడారు!

అయితే... హిమాచల్‌ ప్రదేశ్ ఫలితాల విషయంలో పీకే వ్యాఖ్యలపై రికార్డులు ఉన్నాయని కరణ్‌ థాపర్‌ వివరించే యత్నం చేశారు. దీంతో.. ప్రశాంత్‌ కిషోర్‌ అసహనం ప్రదర్శించారు. పత్రికలు, వెబ్‌ సైట్‌ లు ఇష్టానుసారం రాస్తాయని మాట్లాడారు. అయినా కరణ్‌ థాపర్‌ తన ప్రశ్నను వివరించే యత్నం చేస్తున్నప్పటికీ.. ప్రశాంత్‌ కిషోర్‌ వినలేదు.

ఇదే సమయంలో... హిమాచల్‌ లోనే కాదు తెలంగాణలోనూ మీరు చెప్పిన జోస్యం ఫలించలేదు, మీరు అలా అన్నట్లు రికార్డులు ఉన్నాయి" అని స్పష్టంగా వివరించబోయారు. అయినప్పటికీ కరణ్‌ థాపర్‌ ను మాట్లాడనీయకుండా వీడియో చూపించాలంటూ పీకే పట్టుబట్టారు. అంతేకాదు అసహనం ప్రదర్శించారు. ఇదే సమయలో గొప్పగా ఊహించుకోవద్దంటూ కరణ్ థాపర్ పై పీకే అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు.

దీంతో... నెట్టింట ఈ వీడియో కింద కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. "ప్రశాంత్ కిషోర్‌ ను కరణ్ థాపర్ చిత్తు చేశారు.. ఈ సమయంలో పీకే తన ప్రశాంతనను కోల్పోయి.. అసలు రంగును చూపించాడు" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే... పీకే అంచనాలు తప్పు అని నిరూపితమయ్యాయి.. చంద్రబాబు కొత్త ప్యాకేజీ స్టార్ గా ప్రశాంత్ మారారు అంటూ వైసీపీ నెట్టింట ఈ వీడియోను పోస్ట్ చేసి కామెంట్ పెట్టింది!

4
Full View
Tags:    

Similar News