బీఆర్ఎస్ కు 8 సీట్లు వస్తే .. కోమటిరెడ్డి సంచలనం

మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఛాలెంజ్ విసిరారు

Update: 2024-04-24 07:47 GMT

‘బీఆర్ఎస్ పార్టీకి కనుక పార్లమెంట్ ఎన్నికలలో 8 ఎంపీ సీట్లను గెల్చుకుంటే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని’ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. లోక్ సభ ఎన్నికల్లో 8 నుంచి 12 సీట్లను గెల్చుకుంటామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ఛాలెంజ్ విసిరారు.

తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో కాంగ్రెస్ పార్టీ 12 సీట్లను గెలుచుకుంటుందని, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు మరోసారి కాంగ్రెస్ కే పట్టం కట్టబోతున్నారని కోమటిరెడ్డి జ్యోస్యం చెప్పారు.

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 25 మంది తనతో టచ్ లో ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మాట్లాడుతూ ‘’తమతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు తాము వెల్లడిస్తామని, కేసీఆర్ తో టచ్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల పేర్లు ఆయన చెప్పాలని’’ సవాల్ విసిరారు.

ఇటీవల కాలంలో ప్రతి అంశానికి కోమటిరెడ్డి స్పందిస్తున్నారు. గతంలో గజ్వేల్ నుండి పోటీ చేస్తానని, సిరిసిల్ల నుండి పోటీ చేస్తానని కూడా ఆయన సవాల్ విసరడం, తర్వాత నల్లగొండ నుండి గెలవడం గమనార్హం.

Tags:    

Similar News