డోంట్ కేర్: మంత్రి చెప్పారు.. అధికారులు పక్కన పెట్టారు..!
దీనికి అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పైగా కట్టలకొద్దీ ఫైళ్లను తన ముందు పెట్టడం.. అవి పరిష్కారం కాలేదని చెప్పడంతో మంత్రికి చిర్రెత్తుకొచ్చింది.;
సాధారణంగా అధికారులు అంటే.. మంత్రి మాట వినాలి. మంత్రి చెప్పినట్టు చేయాలి. మంత్రుల దిశాని ర్దేశంలోనే ఉన్నతాధికారులు పనిచేయాల్సి ఉంటుంది. తద్వారానే.. రాష్ట్రంలో పనులు ముందుకు సాగు తాయి. అధికారులు ఎవరికి వారుగా వ్యవహరిస్తే.. ఏ పనులు ముందుకు సాగవు. ఈ విషయం తెలిసి కూడా .. రాష్ట్రంలో కొందరు అధికారులు వ్యవహరిస్తున్నతీరు.. మంత్రులకు చిరాకు తెప్పిస్తోంది. మంత్రి చెప్పి నా కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారు.
తాజాగా దీనికి సంబంధించిన కీలక విషయం తెరమీదికి వచ్చింది. మంత్రి వంగలపూడి అనిత చెప్పిన ఏ పనినీ చేయకుండా.. ఆమె ముందే.. కాలర్ ఎగరేసి కొందరు అధికారులు వ్యవహరించిన తీరు ప్రభుత్వం లో చర్చనీయాంశం అయింది. అధికారులు తన మాట వినిపించుకోవడం లేదని.. గ్రహించిన మంత్రి అని త వారికి సీరియస్ వార్నింగే ఇచ్చారు. సస్పెండ్ చేయాల్సివస్తుంది.. జాగ్రత్త! అని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. నిజానికి అనిత ఇంత సీరియస్ అయ్యారంటే.. విషయం ఎంత సీరియస్‌గా ఉందో అర్దమవుతుంది.
ఏం జరిగింది?
విజయనగరం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న వంగలపూడి అనిత.. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు.. జిల్లా రాజకీయాలు, పనులపై దృష్టి పెట్టారు. తాజాగా ఆమె అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. అయితే.. ఈ సమావేశానికి హాజరైన డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు ... మంత్రి ముందు ఎలాంటి పనులు చేయకుండా పెండింగులో ఉన్న పత్రాలను, ఫైళ్లను పెట్టారు. వీటిని చూసిన మంత్రి.. ఆయా పనులను ఎప్పుడో చేయమని చెప్పాను కదా.. ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
దీనికి అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. పైగా కట్టలకొద్దీ ఫైళ్లను తన ముందు పెట్టడం.. అవి పరిష్కారం కాలేదని చెప్పడంతో మంత్రికి చిర్రెత్తుకొచ్చింది. ``ఒక్క పనిని కూడా చేయలేదు. అంటే. నేను చెప్పిన తర్వాత కూడా మీరు పట్టించుకోలేదని అర్ధమైంది. మరి ఈ సమావేశం ఎందుకు? దేనికి మనం ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం.. మీరు సరైన విధంగా పనిచేయకపోతే.. సీఎంతో చెప్పి సస్పెండ్ చేయిస్తా` అని మంత్రి హెచ్చరించారు. వాస్తవానికి రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. మరి దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.