• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  వైట్ హౌస్ ఆవరణలో ఇరాన్ ...

వైట్ హౌస్ ఆవరణలో ఇరాన్ జెండాలు... ఏమి జరుగుతుంది?

| ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2025-06-23 08:30 GMT

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 6:40 కి దాడులు మొదలుపెట్టి 7:05కి ముగించింది. ఈ 25 నిమిషాల్లో ఇరాన్ లోని మూడు అణుస్థావరాలే లక్ష్యంగా బంకర్ బ్లస్టర్ బాంబులు, తోమహాక్‌ క్రూయిజ్‌ క్షిపణులను ప్రయోగించింది.

అలా పని పూర్తి చేసిన అనంతరం అమెరికా యుద్ధ విమానాలు తిరిగి ఈ ఉదయం వెనక్కి వచ్చాయి. 'ఆపరేషన్‌ మిడ్‌ నైట్‌ హామర్‌' పేరుతో ఇరాన్‌ లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహాన్ అణుశుద్ధి కేంద్రాలపై దాడులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించుకుంది. ఈ నేపథ్యలో అగ్రరాజ్యంలోని పలు నగరాల్లో యుద్ధ వ్యతిరేక నిరసనలు తీవ్రతరమయ్యాయి.

అవును... ఇజ్రాయెల్‌ - ఇరాన్‌ ఉద్రిక్తతల నడుమ.. అమెరికా రణరంగంలోకి దిగడంతో పశ్చిమాసియా ఒక్కసారిగా భగ్గుమన్న సంగతి తెలిసిందే. ఈ ఉద్రిక్తతల వేళ.. అమెరికా ప్రధాన నగరాల్లో ఇరాన్‌ మద్దతు ప్రదర్శనలు చేపట్టారు. ఇందులో భాగంగా నేరుగా అమెరికా అధ్యక్ష భవనం "వైట్ హౌస్" ఆవరణలోనే ట్రంప్‌ వ్యతిరేక నినాదాలతో ప్రదర్శన జరగడం గమనార్హం.

ఈ సందర్భంగా... 'ఇరాన్‌ పై యుద్ధం వద్దు'.. 'ఇజ్రాయెల్‌ కు మద్దతు ఇవ్వడం ఆపండి'.. 'గాజాలో నరమేధం ఆగిపోవాల్సిందే' అంటూ అధ్యక్షుడు ట్రంప్‌ ను ఉద్దేశించి పలువురు ఇరానియన్లు నినాదాలు చేశారు. ఈ విధంగా సాగుతున్న యుద్ధ వ్యతిరేకత నినాదాలతో అమెరికాలోని పలు ప్రధాన నగరాలు మారుమ్రోగుతున్నాయి.

ఈ నిరసనల నేపథ్యంలో... అక్కడి భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. వాస్తవానికి ఇరాన్ పై అమెరికా దాడుల అనంతరం పలు సున్నితమైన ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. దౌత్య కార్యాలయాలతో పాటు మతపరమైన కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం చేసినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

కాగా... ఇరాన్ పై అమెరికా దాడుల అనంతరం ట్రంప్‌ మరోసారి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇందులో భాగంగా... శాటిలైట్‌ చిత్రాలను గమనించినట్లయితే.. ఇరాన్‌ లోని అన్ని అణుకేంద్రాలకు తీవ్ర నష్టం జరిగినట్లు అర్థమవుతోందని అన్నారు. ఈ సమయంలో... 'తుడిచిపెట్టుకుపోయాయ్‌' అని అనడం సరైన పదమేమో అని రాసుకొచ్చారు.

Happening now: Anti-war protesters have started to rally in front of the White House, calling for no war with Iran and an end to U.S. support to Israel. pic.twitter.com/mmenVH1wOG

— BreakThrough News (@BTnewsroom) June 18, 2025

HAPPENING NOW 🚨: Anti-war protest in Boston following US strikes in Iran. pic.twitter.com/LRP6wELFtB

— Ron Smith (@Ronxyz00) June 22, 2025
Tags:    
  • IranUSConflict 
  • OperationMidnightHammer 
  • IsraelIranWar 
  • USAirstrikes 
  • MiddleEastTensions 
  • NoWarOnIran 
  • GlobalProtests 
  • StopTheWar 
  • WhiteHouseProtests 
  • TrumpStatement 
  • Iranisraelwar 

Similar News

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి హవా.. వైసీపీకి భారీ దెబ్బ

2026-11-03 08:54 GMT

ఒక్క మ్యాచ్ కోసం ఇన్ని రిక్వెస్టులా? 2027 వరల్డ్ కప్‌లో ఇండియా-పాక్ క్రేజ్ మామూలుగా లేదుగా!

2026-11-03 08:21 GMT

మిడ్ టర్మ్ ఎన్నికల వేళ ఇరాన్‌పై అమెరికా రహస్య దాడి.. మళ్లీ యుద్ధమేఘాలు.. ఎందుకిలా చేసింది?

2026-11-03 07:23 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

అమెరికా సెనేట్‌లో డెమోక్రాట్లు గెలిచే అవకాశం 75 శాతం.. ట్రంప్ కు ఇది షాకే..

2026-11-03 06:05 GMT

అది పాస్‌పోర్ట్ బుక్ లేదా ఫోన్ డైరీనా.. రెన్యూవల్ ఆఫీసర్ కి షాక్ ఇచ్చిన వ్యక్తి!

2026-11-03 06:04 GMT

పోలింగ్ రోజు ఆందోళన.. జగన్‌కు పోలీసుల షాక్.. కేసు నమోదు

2026-11-03 05:38 GMT

Grok AI నిర్వహణ ఖర్చులు తలకుమీదకు.. ఆదాయం కంటే ఖర్చులే ఎక్కువంటున్న ఎలాన్ మస్క్!

2026-11-03 05:38 GMT

ఈజిప్టు హైవేపై డిజిటల్ బిల్‌బోర్డ్ హ్యాక్.. అశ్లీల వీడియోలతో వాహనదారులకు షాక్!

2026-11-03 05:37 GMT

విదేశీ...స్వదేశీ : మోడీ వర్సెస్ రాహుల్ !

2026-11-03 04:12 GMT

ఎన్నికల రాష్ట్రాలలో భారీగా ఓట్ల కోత... విపక్షాలు గగ్గోలు

2026-11-03 04:11 GMT

Copyright @2026

Powered by Blink CMS